18న మార్చి నెల దర్శన కోటా విడుద‌ల

Spread the love

ప్ర‌క‌టించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

తిరుమల : 2026 మార్చి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల ( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబ‌ర్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం డిసెంబ‌ర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు డిసెంబ‌ర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీ‌వారి సాల‌క‌ట్ల తెప్పోత్స‌వాలు, శ్రీ‌వారి సాల‌క‌ట్ల‌ వ‌సంతోత్స‌వాల‌ టికెట్లను 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని సూచించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్.

  • Related Posts

    భక్తుల ఆరోగ్య భద్రతే టీటీడీ ప్రధాన లక్ష్యం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన టీటీడీ అదనపు ఈవో చౌద‌రి తిరుమల : భక్తుల ఆరోగ్యం, ఆహార భద్రతకు టీటీడీ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి స్ప‌ష్టం చేశారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఆడిటోరియంలో…

    యుద్ద ప్రాతిప‌దిక‌న ప‌నులు పూర్తి చేయాలి

    Spread the love

    Spread the loveటీటీడీ అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి తిరుమల : టీటీడీ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఇంజ‌నీరింగ్ ప‌నులు యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని ఆదేశించారు అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి. ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో జరుగుతున్న పలు అభివృద్ధి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *