బంగారం బ్యాగును భ‌క్తుడికి అప్ప‌గించిన టీటీడీ

తిరుప‌తి : తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తుల ప్రవేశ ద్వారమైన అలిపిరి చెక్‌పాయింట్ వద్ద సుమారు 11.35 గంటలకు భద్రతా తనిఖీల సందర్భంగా ఓ భక్తుడు అనుకోకుండా ఒక బ్యాగును అక్కడే మరిచి పోయాడు.వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఆ బ్యాగును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బ్యాగును తెరిచి ప‌రిశీలించారు. బ్యాగులో సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి, ఆ బ్యాగు హైదరాబాద్‌కు చెందిన మహేష్ కు చెందినదిగా గుర్తించారు.

అప్పటికే తాను బ్యాగును మరిచి పోయిన విషయాన్ని కూడా గుర్తించని భక్తుడిని వెంటనే కార్యాలయానికి పిలిపించారు. పూర్తి వివరాలను ధృవీకరించిన అనంతరం బ్యాగును భద్రంగా స‌ద‌రు భ‌క్తుడికి అప్పగించారు. ఈసంద‌ర్భంగా పోయింద‌ని అనుకుని తీవ్ర మ‌నో వేద‌న‌కు గురైన భ‌క్తుడు ఆనందం వ్య‌క్తం చేశాడు. ఇదంతా ఆ శ్రీ వేంక‌టేశ్వురుడి మహిమేన‌ని పేర్కొన్నాడు. తాను పోగొట్టుకున్న బ్యాగును ఉన్న‌ది ఉన్న‌ట్టుగా అందించిన టీటీడీ యాజమాన్యానికి, విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది నిజాయితీ, అప్రమత్తత, సేవాభావాన్ని భక్తుడు మహేష్ అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.

  • Related Posts

    జోగులాంబ స‌న్నిధిలో ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

    జోగులాంబ గ‌ద్వాల జిల్లా : భార‌త దేశంలో అత్యంత సుప్రిసిద్ద‌మైన శ‌క్తి పీఠంగా విరాజిల్లుతున్న తెలంగ‌దాణ‌లోని జోగులాంబ గ‌ద్వాల జిల్లా ఆలంపూర్ లోని జోగులాంబ బాల బ్ర‌హ్మేశ్వ‌ర ఆల‌యాన్ని సోమ‌వారం ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆనంద్ బర్దన్ దంపతులు ఆలంపూర్…

    మీనాక్షి ఆల‌య ప్ర‌సాదం స్వీక‌రించిన సీఎం విజ‌య్

    చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ను సోమ‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి టీవీకే ర‌మేష్. ఈ సంద‌ర్బంగా ప్ర‌ముఖ ఆల‌య‌మైన మీనాక్షి సుంద‌రేశ్వ‌ర‌ర్ ఆల‌య ప్ర‌సాదాన్ని సీఎంకు స్వ‌యంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *