ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని
ఇథియోపియా : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన జోర్డాన్ లో పర్యటించారు. అక్కడి నుంచి నేరుగా ఇథియోపియాకు వెళ్లారు. ఆ దేశ రాజధాని అడిస్ అబాబాకు చేరుకుంది. ఈ సందర్బంగా ఆ దేశ ప్రభుత్వం నుంచి ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఇదే విషయాన్ని మోదీ స్వయంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తాజాగా రాజధాని రాజధాని అడిస్ అబాబాలోని నేషనల్ ప్యాలెస్ మ్యూజియంను సందర్శించారు ప్రధానమంత్రి.
ఇందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇథియోపియా చరిత్ర, సంస్కృతి గురించి విశేషాలను వివరించారు ఆ దేశ ప్రధానమంత్రి అబియ్ అహ్మద్ అలీ. ఈ సందర్బంగా సదరు ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు నరేంద్ర మోదీ. భారత దేశం నుంచి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం ఇథియోపియా దేశానికి ఉంటుందని స్పష్టం చేశారు. తమ దేశం నిత్యం శాంతి, సామరస్యం, సంబంధాలను కోరుకుంటుందని ఏ దేశంతోనూ యుద్దానికి దిగదని పేర్కొన్నారు నరేంద్ర దామోదర దాస్ మోదీ. తమ దేశాన్ని పర్యటించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇథియోపియా ప్రధానమంత్రి.





