ప్రశంసలు కురిపించిన నటి ప్రీతి జింతా
అమెరికా : ప్రముఖ వర్దమాన బాలీవుడ్ నటి, ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు యజమానురాలు ప్రీతి జింతా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను అనుకోకుండా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ మూవీని థియేటర్ లో చూశానని అన్నారు. ఒకటా రెండా ఏకంగా మూడున్నర గంటల పాటు తీసిన ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు ప్రీతి జింతా. తన జీవితంలో ఇలాంటి సినిమాను చూస్తానని అనుకోలేదని అన్నారు నటి. ఇలా ఇన్ని గంటలు ఎలా చూడాలని అనుకుంటున్న తరుణంలోనే సినిమా పూర్తయి పోయిందని , తానే ఆశ్చర్యానికి లోనైనట్లు తెలిపింది ప్రీతి జింతా.
మరోసారి ధురంధర్ సినిమాను చూడాలని అనుకుంటున్నట్లు చెప్పారు. గురువారం సామాజిక మాధ్యమాలు ఇన్ స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్, లింక్డ్ ఇన్ వేదికగా పంచుకుంది నటి. ఆదిత్య ధర్ సినిమాను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఎలా చెప్పాలో నాకు మాటలు రావడం లేదు. ఇప్పటికిప్పుడు తనకు ఫోన్ చేయాలని ఉందని పేర్కొంది ప్రీతి జింతా. నాకెలా అనిపించిందో, ఈ కళాఖండాన్ని నేను ఎంతగా ప్రేమించానో చెబుతానని తెలిపింది. అప్పటి వరకు నేను చెప్పేదొక్కటే, దీన్ని అస్సలు మిస్ అవ్వకండి మిత్రులారా! వెళ్లి చూడాలని కోరింది. ఈ కళాఖండాన్ని సజీవంగా తీసుకు వచ్చిన నటీనటులు, సాంకేతిక నిపుణుల బృందానికి అభినందనలు తెలిపారు నటి.







