ఎల్బీ స్టేడియంలో జరుగుతుందన్న నిర్వాహకులు
హైదరాబాద్ : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ , అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ కీ రోల్ పోషించిన చిత్రం రాజా సాబ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చీఫ్ టీజీ విశ్వ ప్రసాద్, కీర్తి ప్రసాద్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. దీనికి దర్శకత్వం వహించాడు మారుతి. పూర్తిగా రొమాంటిక్, కామెడీ, ఎంటర్ టైనర్ , హారర్ జానర్ లో తీశాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్ , టీజర్ , సాంగ్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. తాజాగా సినిమాలోని సహానా సాంగ్ ను విడుదల చేశారు. ఇప్పటికే మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. జనవరి 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ది రాజా సాబ్ ను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు సినీ నిర్మాతలు, మూవీ మేకర్స్. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు.
ప్రభాస్ మునుపెన్నడూ చూడని అవతార్‌లో కనిపించనున్నారు ఈ సినిమాలో. అభిమానులు దానిని చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ది రాజా సాబ్ ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. ట్రైలర్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం వినిపిస్తున్న తాజా వార్త ఏమిటంటే, ది రాజా సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 27న ఎల్బీ స్టేడియంలో జరగనుంది. అయితే, దీనిపై చిత్ర నిర్మాతలు ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. చిత్రంలోని ముగ్గురు హీరోయిన్లు నటించిన ఒక పాట త్వరలో విడుదల కానుంది. ది రాజా సాబ్ ఒక హారర్ జానర్ చిత్రం. ట్రైలర్‌కు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.







