డిసెంబర్ 21న తిరుమలలో పల్స్ పోలియో

వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

తిరుమల : దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమలలో డిసెంబర్ 21వ తేదీ పల్స్ పోలియో కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం డిసెంబర్ 21న ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని స్ప‌స్టం చేసింది టీటీడీ. భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపింది.

అశ్విని ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, జీఎన్సీ టోల్ గేట్, సిఆర్ఓ, పీఏసీ 1 , 2, కొత్త బస్టాండ్, హెల్త్ ఆఫీస్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 , 2, ఏటీసీ, ఎంబీసీ-34, వరాహస్వామి విశ్రాంతి గృహం 1, రాంభగీచా రెస్ట్ హౌస్ 1, కల్యాణకట్ట, మేదరమిట్ట, పాప వినాశనం, సుపథం, బాలాజీ నగర్ వినాయక ఆలయం, బాలాజీ నగర్ బాలబడి, ఎస్వీ హై స్కూల్, తిరుమల ఆలయం లోపల , వెలుపల, ఉద్యోగుల డిస్పెన్సరీల వద్ద పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేయ‌నున్న‌ట్లు పేర్కొంది.

ఇందులో భాగంగా 20వ తేది ఉదయం 10 గంటలకు ఎస్వీ హైస్కూల్ నుంచి బాలాజీ నగర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది టీటీడీ. మధ్యాహ్నం 2 గంటల నుంచి యాత్రికులు , స్థానికుల కొరకు జీపులో ప్రకటనలు చేస్తూ అవగాహన కలిగించనున్న‌ట్లు వెల్ల‌డించింది.

  • Related Posts

    ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోగ్యం కోసం శ్రీ‌వారికి విన్న‌పం

    తిరుమ‌ల : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటూ తిరుమ‌ల‌ను సంద‌ర్శించారు త‌న భార్య అన్నా లెజ్ నోవా. ప‌వ‌న్ కు ఇటీవ‌లే ముంబైలో భుజానికి శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. మూడు వారాల పాటు విశ్రాంతి…

    ‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

    హైద‌రాబాద్ : రాష్ట్ర సంస్కృతిని, సాంప్ర‌దాయాన్ని ప్రతిబింబించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభం అయ్యాయి ఘ‌నంగా. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జంట నగరాల భ‌క్తులంద‌రికీ శుభాకాంక్షలు తెలిపారు. హైద‌రాబాద్ ప్రజల జీవన విధానం,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *