లిటిగెంట్ పిటిషనర్లకు కౌన్సెలింగ్ ఇవ్వాలి

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. లిటిగెంట్ పిటిషనర్లను ఏ విధంగా కట్టడి చేయాలని ఆదేశించారు. ఎలాంటి ప్రజా ప్రయోజనం లేకుండా చేసే ఫిర్యాదు దారులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 81 మంది లిటిగెంట్ పిటిషనర్లు ఉన్నట్టు గుర్తించాం అన్నారు. వీరు సరాసరి ఒక్కొక్కరు 246 పిటిషన్లు పెడుతున్నారు. వీరి వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపించాలి. వారు పెట్టే అర్జీల్లో ప్రజా ప్రయోజనాలు ఉంటే వాటిని పరిశీలించాలి. ప్రభుత్వాన్ని, అధికారులను బద్నాం చేసే ఉద్దేశంతో పిటిషన్లు పెట్టే వారిని గుర్తించాలి. ఫిర్యాదుల పరిష్కారంలో ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ప్రాధాన్యతల వారీగా ఆర్థిక సమస్యలను పరిష్కరిద్దాం.

ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం కారణంగా ప్రస్తుతం 49 శాతం లోటు వర్షపాతం ఉంది. ఈ ప్రభావం నుంచి బయటపడేసే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. ఈ మేరకు రైతుల్లో అవగాహన కల్పించాలి. డ్రై క్రాప్స్ వేసేలా రైతులను ప్రొత్సహించండి. ఇదే సమయంలో వీబీ జీ రామ్ జీ పనులను పెద్ద ఎత్తున చేపట్టాలి. జలధార పనులకు వీబీ జీ రామ్ జీ పనుల్ని అనుసంధానం చేయాలి. ప్రజాభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పని విధానం మార్చుకోవాలి. పరిపాలనా విధానాలను మెరుగు పరుచుకోవాలి. సమస్యలు ఉత్పన్నమయ్యాక చర్యలు తీసుకోవడంతో పాటు… ముందుగానే ఏయే సమస్యలు వస్తాయనే విషయాన్ని అంచనా వేసి.. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి అని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    సోనియా గాంధీ కేసు మెజిస్ట్రేట్ కు అప్ప‌గించిన కోర్టు

    న్యూఢిల్లీ : ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ ఓటర్ల జాబితా కేసును తిరిగి మేజిస్ట్రేట్‌కు అప్పగించంది ఢిల్లీ కోర్టు. మేజిస్ట్రేట్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులో తగిన కారణాలు లేవని పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కొత్తగా…

    డీఎస్సీ స్కాంపై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాలి

    విజ‌య‌వాడ : డీఎస్సీ స్కాంపై CBI విచారణ జరపాలని, లోకేష్ రాజీనామా చేయాలని YSRCP డిమాండ్ చేసింది. కుంభకోణం వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీసేందుకు నిష్పాక్షికమైన విచారణ జరపాలని , ఇందుకు బాధ్య‌త వ‌హిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *