సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
విజయవాడ : ఏపీ రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గత జగన్ రెడ్డి సర్కార్ పై మండిపడ్డారు. జగన్ రెడ్డి ఒక్కడే నిర్ణయాలు తీసుకున్నాడని, మంత్రులను డెమ్మీగా మార్చేశాడని ఆరోపించారు. మంగళవారం పార్థసారథి మీడియాతో మాట్లాడారు. తన ఐదేళ్ల పాలనా కాలంలో కేవలం మూడు రాజధానుల పేరుతో ముగించాడని మండిపడ్డారు. ఆనాడు తీసుకొచ్చిన జిఓ ను తాము మెరుగు పరిచి పిపిపి ప్రజల్లోకి తీసుకు వెళుతున్నామని తెలిపారు. ఈ సందర్బంగా ఆయన పీపీపీ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ విధానం ఉందన్నారు. కేవలం ఏపీలో ఒక్కచోటనే ఉందన్నట్టుగా వైసీపీ నేతలు మాట్లాడటం దారుణమన్నారు కొలుసు పార్థసారథి.
మరి జగన్ రెడ్డి తీసుకు వచ్చిన కాలేజీల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ పిల్లలకు 15 శాతం సీట్లు ఎక్కువగా రావడం మీకు ఇష్టం లేదా అని నిలదీశారు. మౌలిక వసతులు కల్పించాలంటే పెట్టుబడులు తప్పకుండా రావాలని, లేకపోతే ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. కొత్తగా తీసుకు వచ్చిన పీపీపీ విధానం వల్ల రూ. 163 కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడకుండా ఉంటుందన్నారు. సోలార్ కంపెనీ లను రద్దు చేయడం వల్ల 9 వేల కోట్ల రూపాయల భారం ప్రభుత్వం పై పడిందని ఆరోపించారు కొలుసు పార్థసారథి.





