ఏపీకి భారీ ఎత్తున పెట్టుబ‌డుల వెల్లువ‌

స‌మాచార శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి

విజ‌య‌వాడ : ఏపీ రాష్ట్ర స‌మాచార‌, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌త జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ పై మండిప‌డ్డారు. జ‌గ‌న్ రెడ్డి ఒక్క‌డే నిర్ణ‌యాలు తీసుకున్నాడ‌ని, మంత్రుల‌ను డెమ్మీగా మార్చేశాడ‌ని ఆరోపించారు. మంగ‌ళ‌వారం పార్థ‌సార‌థి మీడియాతో మాట్లాడారు. త‌న ఐదేళ్ల పాల‌నా కాలంలో కేవ‌లం మూడు రాజ‌ధానుల పేరుతో ముగించాడ‌ని మండిప‌డ్డారు. ఆనాడు తీసుకొచ్చిన జిఓ ను తాము మెరుగు పరిచి పిపిపి ప్రజల్లోకి తీసుకు వెళుతున్నామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న పీపీపీ విధానంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ విధానం ఉంద‌న్నారు. కేవ‌లం ఏపీలో ఒక్క‌చోట‌నే ఉంద‌న్న‌ట్టుగా వైసీపీ నేత‌లు మాట్లాడ‌టం దారుణ‌మ‌న్నారు కొలుసు పార్థ‌సార‌థి.

మ‌రి జ‌గ‌న్ రెడ్డి తీసుకు వ‌చ్చిన కాలేజీల పరిస్థితి ఏమిటి అని ప్ర‌శ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ పిల్లలకు 15 శాతం సీట్లు ఎక్కువగా రావడం మీకు ఇష్టం లేదా అని నిల‌దీశారు. మౌలిక వసతులు క‌ల్పించాలంటే పెట్టుబ‌డులు త‌ప్ప‌కుండా రావాల‌ని, లేక‌పోతే ఇబ్బంది ఏర్ప‌డుతుంద‌న్నారు. కొత్త‌గా తీసుకు వ‌చ్చిన పీపీపీ విధానం వ‌ల్ల రూ. 163 కోట్ల రూపాయ‌ల భారం ప్ర‌భుత్వంపై ప‌డ‌కుండా ఉంటుంద‌న్నారు. సోలార్ కంపెనీ లను రద్దు చేయడం వల్ల 9 వేల కోట్ల రూపాయల భారం ప్రభుత్వం పై పడిందని ఆరోపించారు కొలుసు పార్థసార‌థి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *