ప్రాథమిక నోటిఫికేషన్ మేరకు యధావిధిగానే
అమరావతి : జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శనివారం సచివాలయంంలో సమీక్ష నిర్వహించారు. పునర్విభజనపై గత నెల 27న జిల్లాల ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల అయింది. అభ్యంతరాల గడువు నేటితో ముగుస్తున్నందున వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు వచ్చాయి. వీటిని సమీక్షించిన తర్వాత డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ప్రాథమిక నోటిఫికేషన్ మేరకు ఈ ప్రాంతాలు యధావిధిగానే ఉండనున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని నందిగం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలి డివిజన్‌కు, అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్‌కు, కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్‌కు, అద్దంకి రెవెన్యూ డివిజన్‌లోని అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, జె. పంగులూరు, కొరిసపాడును ప్రకాశం జిల్లాలోకి మార్పు చేస్తారు.
ఇక కనిగిరి రెవెన్యూ డివిజన్‌లోని మర్రిపూడి, పొన్నలూరు మండలాల్ని కందుకూరు రెవెన్యూ డివిజన్‌లోకి మారుస్తూ ప్రకాశం జిల్లాలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. కందుకూరు డివిజన్‌లోని 5 మండలాలను ప్రకాశం జిల్లాకు మార్చడంతో పాటు కందుకూరు డివిజన్‌లోని మిగిలిన రెండు మండలాలు అయిన వరికుంటపాడు, కొండాపురం మండలాలను కావలి డివిజన్‌లోకి మార్పు చేసేందుకు ప్రతిపాదించారు . పలమనేరు డివిజన్‌లోని బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్‌కు, చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్‌లోని చౌడేపల్లి, పుంగనూరును మదనపల్లి రెవెన్యూ డివిజన్‌కు ,
చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్‌లోని సదుం, సోమలను మదనపల్లి జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్‌కు మార్చాలని ప్రతిపాదించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్తగా మడకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారు. కదిరి రెవెన్యూ డివిజన్‌లోని ఆమదగురు మండలాన్ని పుట్టపర్తి రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేయాలని ప్రతిపాదించారు.







