అత్యంత దారుణమన్న ఏఐసీసీ చీఫ్
ఢిల్లీ : బంగ్లాదేశ్ రాజకీయాలలో హిందువుల హత్యలను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఖండించారు .
తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం అని అన్నారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను పరిమితం చేయడానికి బాగా ఆలోచించి చేసిన కుట్రగా పేర్కొన్నారు. రాహుల్ జీ ‘ఓట్ల దొంగతనం’ ఆధారాలను దేశం ముందు పదే పదే వాస్తవాలు, ఉదాహరణలతో సమర్పించారని తెలిపారు. శనివారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత 11 సంవత్సరాలుగా, ED, IT , CBI వంటి సంస్థలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో దేశం చూసిందన్నారు. బిజెపి, సంఘ్ పరివార్ జాతీయ హెరాల్డ్ సమస్యపై మా నాయకుల ప్రతిష్టను దిగజార్చడంలో నిమగ్నమై ఉన్నాయని ఆవేదన చెందారు ఖర్గే. అయినా తాము చట్ట పరంగా పోరాటం చేస్తూ వచ్చామన్నారు .
సత్యమేవ జయతే ఇది నిత్యం రాహుల్ గాంధీ చెబుతూ వస్తున్నారని అన్నారు ఖర్గే. చివరకు తమపై ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా చివరకు అంతిమ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఢిల్లీ కోర్టు కూడా పేర్కొన్నదని తెలిపారు . తొమ్మిది రాష్ట్రాలతో పాటు మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో కొనసాగుతున్న ఎన్నికల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సందర్బంగా ఓటరు తొలగింపు అంశంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల దొంగతనం ఆరోపణలకు వ్యతిరేకంగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రచారాలకు మద్దతు ఇస్తూ వచ్చారని చెప్పారు.







