సంచలన ఆరోపణలు చేసిన సీఎం స్టాలిన్
చెన్నై : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్ర సర్కార్ ను ఏకి పారేశారు. శనివారం మీడియాతో మాట్లాడారు. బిజెపి అధికారం చేపట్టినప్పటి నుండి మైనారిటీలపై ద్వేషపూరిత ప్రసంగాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపినప్పటికీ కొన్ని మితవాద హింసాత్మక గ్రూపులు మైనారిటీలపై దాడి చేస్తున్నాయని ఆరోపించచారు. ఇది దేశానికి ఆందోళనకరమైన సందేశాన్ని పంపుతుందని అన్నారు. జబల్పూర్, రాయ్‌పూర్‌లలో మైనారిటీలపై దాడులు జరిగాయని వచ్చిన ఆరోపణలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉదహరించారు. ఇది ఆమోదయోగ్యం కాదని అన్నారు.
ప్రధానంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుండి మైనారిటీలపై ద్వేష పూరిత ప్రసంగాలు 74 శాతం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని మితవాద హింసాత్మక గ్రూపులు చేస్తున్న దాడులు దేశానికి ఆందోళనకరమైన సందేశాన్ని పంపుతున్నాయని ఆయన అన్నారు. మణిపూర్ తర్వాత, జబల్పూర్, రాయ్‌పూర్ , ఇతర ప్రాంతాలలో మైనారిటీలపై దాడుల నివేదికలు సామరస్యాన్ని విలువైన ఎవరికైనా ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు సీఎం. కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి మైనారిటీలపై ద్వేషపూరిత ప్రసంగాలు 74 శాతం పెరగడం రాబోయే తీవ్రమైన ప్రమాదాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు.







