సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపు
హైదరాబాద్ : విద్యార్థులకు చదువుతో పాటు విలువలు మరింత ముఖ్యమని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. SSC 11 బ్యాచులు, CBSE 8 బ్యాచులు, ఇంటర్ 9 బ్యాచులు, డిగ్రీ 7 బ్యాచులు ఎన్టీఆర్ విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చాయన్నారు. నల్సార్, ఎన్.ఎల్.యూ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించడం ఆనందంగా ఉందన్నారు. సమాజంలో సమానత్వం కోసం పరితపించే వ్యక్తి ఎన్టీఆర్. ట్రస్ట్ పెట్టి పిల్లలకు చదువు చెప్పించే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశమే. మన సంస్కృతి-సంప్రదాయాలను మరిచిపోవద్దు. ఆధునాతన విధానాల్ని అందిపుచ్చు కోవాలని అన్నారు. విలువలను కాపాడుకోవాలి. విద్యార్థులందరూ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి… టెక్నలాజీని అందిపుచ్చుకోవాలి. ఆన్ లైన్, ఆఫ్ లైన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయని అన్నారు సీఎం.
ఎడిషనల్ కోర్సులు చేయండి. నిరంతరం నేర్చుకునే అంశంపై ఫోకస్ పెట్టండి. విద్యతో పేదరికాన్ని జయించవచ్చు అప్పుడు సంపద తనంతట వస్తుంది. ప్రాణత్యాగాలు చేసిన కార్యకర్తల కుటుంబాల పిల్లలకు ఈ విద్యా సంస్థల ద్వారా విద్యను అందిస్తున్నాం. దేశం మెచ్చే విధంగా విద్యా సంస్థలను రన్ చేయాలి. విద్యార్థులు చక్కగా చదువుకుని సమాజంలో గుర్తింపు దక్కించుకోవాలి… ఎన్టీఆర్ విద్యా సంస్థలకు విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు 10 లక్షల మందికి రక్తదానం చేశారు. 273 మంది తలసేమియా బాధిత చిన్నారులకు ఉచితంగా రక్త మార్పిడి చేశారు. సంజీవని క్లినిక్ ల ద్వారా 22 లక్షల మందికి ఆరోగ్య సేవలు అందించారు. ప్రకృతి విపత్తుల్లో బాధితులను ట్రస్ట్ ద్వారా ఆదుకుంటున్నారు. ట్రస్ట్ ద్వారా రక్షిత తాగునీటిని అందిస్తున్నారు.”అని సీఎం అన్నారు.






