నిప్పులు చెరిగిన వరుదు కళ్యాణి
విశాఖపట్నం : వైసీపీ సీనియర్ నాయకురాలు వరుదు కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఆమె రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత చేసిన కామెంట్స్ పై స్పందించారు. మీకు నచ్చింది ఏదైనా చేసుకోవచ్చని అన్నారు. మీరు బెదిరింపులకు పాల్పడితే ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకుని లేరన్నారు. ఆదివారం వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. మా వైసీపీ కార్యకర్తలు ఎవరూ భయపడరన్నారు.మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ రిటర్న్ గిఫ్ట్ తిరిగి ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ సినిమాకి మేకపోతును బలి ఇస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని హోం మంత్రిని ప్రశ్నించారు.
మరి ఇంతలా మాట్లాడుతున్న నువ్వు మీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు అభిమానులు కత్తులు పట్టుకుని తిరిగితే ఎందుకు నోరు మెదప లేదంటూ నిలదీశారు వరుదు కళ్యాణి. ఎవరి మెప్పు పొందటానికి నువ్వు కామెంట్స్ చేస్తున్నావో నీ అంతరాత్మకే తెలుసన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసింది కాకుండా పైగా తమపై, తమ నాయకుడిపై ఆరోపణలు చేయడం, విమర్శించడం తగదన్నారు. ముందు శాఖాపరంగా పట్టు తెచ్చుకో. ఆపై గాడి తప్పిన లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేయాలని హితవు పలికారు వంగలపూడి అనితకు వరుదు కళ్యాణి.






