తండోప తండాలుగా తరలి వచ్చిన భక్తులు
తిరుమల : భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది తిరుమల పుణ్యక్షేత్రం. ఇప్పటి వరకు 1,68,000 వేల మందికి పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించారు. ఈమేరకు ఇప్పటికే డిసెంబర్ 30, 31వ తేదీతో పాటు జనవరి 1వ తేదీన కూడా డిప్ లో భాగంగా కేటాయించిన టోకెన్ల వారీగా దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ.
ఇదిలా ఉండగా వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో బుధవారం తెల్లవారుజామున స్వామివారి పుష్కరిణి తీర్థ ముక్కోటి నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ ను స్వామి పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి చక్రస్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు ఈవో . కాగా టోకెన్లు లేని వారికి దర్శనం ఉండదని ఇప్పటికే స్పష్టం చేశామన్నారు.







