రూ. 105 కోట్లకు నెట్ ఫ్లిక్స్ స్వంతం
ముంబై : ప్రముఖ అమెరికన్ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సంచలన ప్రకటన చేసింది. శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్ నటించిన చిత్రం పెద్ది డిజిటల్ రైట్స్ ను స్వంతం చేసుకున్నట్లు ప్రకటించింది. ప్రకటన వెలువడగానే మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. భారీ బడ్జెట్ తో దీనిని నిర్మించారు. ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటికే పాటలు, పోస్టర్స్, గ్లింప్స్ దుమ్ము రేపుతున్నాయి.
ఇక దర్శకుడు బుచ్చిబాబు సన డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా పేరు పొందాడు. తను ఉప్పెనతో ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రావడంతోనే బ్లాక్ బస్టర్ మూవీ చేశాడు. ఆ తర్వాత అదృష్టం తలుపు తట్టింది. డిఫరెంట్ కథతో ముందుకు వచ్చాడు. ఆ కథను పూర్తిగా నమ్మాడు రామ్ చరణ్. అది తప్పకుండా వర్కవుట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు . ఈ సమయంలో ప్రస్తుతం రెహమాన్ సమకూర్చిన స్వరాలు ఈలలు వేసేలా, కేరింతలు కొట్టేలా ఉన్నాయి. మరో వైపు వచ్చే మార్చి నెలలో 27వ తేదీన పెద్ది చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు దర్శకుడు బుచ్చిబాబు సన.






