సంచలన ప్రకటన చేసిన టీటీడీ
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమలలో ఈనెల 25న రథ సప్తమి సందర్భంగా 24, 26వ తేదీల వరకు SSD టోకెన్ల జారీ చేయడం లేదని స్పష్టం చేశారు టీటీడీ ముఖ్య కార్య నిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్. 25న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఈనెల 24న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించడం జరగని స్పష్టం చేశారు ఈవో. ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను కూడా రద్దు చేసినట్లు తెలిపారు.
అంతే కాకుండా ఆర్జిత సేవలు కూడా రద్దు చేసినట్లు ప్రకటించారు అనిల్ కుమార్ సింఘాల్. ఇదిలా ఉండగా ఈవో మీడియాతో విడుదల చేసిన అధఙకారిక ప్రకటనలో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి సామాన్యులకు అత్యధికంగా పెద్ద పీట వేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా వైకుంఠ ద్వార దర్శనాలకు రికార్డు స్తాయిలో భక్తులు దర్శనం చేసుకున్నారని చెప్పారు. ఈ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ అనిల్ కుమార్ సింఘాల్ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.






