నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబర్ గా ఫేమస్
హైదరాబాద్ : టెక్నాలజీ మారింది. డిజిటల్ మీడియా వచ్చాక అవకాశాలు అపారంగా పెరిగాయి. ఎవరైనా సరే తమ టాలెంట్ తో ఒక్క రోజులోనే పాపులర్ అవుతున్నారు. ఇందుకు సాక్ష్యం తాజాగా మెగాస్టార్ చిరంజీవి, నయనతార, విక్టరీ వెంకటేశ్ తో తీసిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీలో ఛాన్స్ దక్కించుకున్నయూట్యూబర్, ఇన్ ఫ్లూయన్సర్ రమా నందన అలియాస్ నందూ. తను నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. అద్భుతమైన కంటెంట్ తో తను పాపులర్ అయ్యారు.
సోషల్ మీడియాలో చాలా పాపులర్ తను. కరోనా టైం నుంచి తన వీడియోలతో అలరిస్తున్న నందు 27 లక్షల పైచిలుకు సబ్స్క్రైబర్లను కలిగి ఉన్నారు. ఆమె ప్రయాణం అంత ఈజీ కాదు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి వచ్చిన నందు ‘మన శంకర వరప్రసాద్’ సినిమాలో మెరిశారు.
ఈ అవకాశం రావడం అదృష్టమే కాదు.. ఆమె టాలెంట్ కూడా. ఎన్నో సంవత్సరాలుగా ఆమె వీడియోలు చాలా మందిని చూసేలా చేస్తున్నాయి. ఒక స్టేజ్లో విమర్శల్ని తట్టుకోలేక వెనకడుగు వేస్తారేమో అనిపించినా ఎక్కడా ఆమె వెనక్కి తగ్గలేదు. అంతే కాదు అదర లేదు.. బెదర లేదు. ఇప్పటికీ ఆమెని విమర్శిస్తూనే ఉంటారు. వాటన్నిటిని తిప్పి కొట్టే అవకాశం వచ్చింది రమా నందనకు. ఒక లెజెండరీ నటుడి పక్కన నిలబడటమే కాదు డైలాగ్స్ చెప్తూ 5 నిమిషాల సీన్లో ఏకధాటిగా నటించే అవకాశం రావడం అంటే ఆషామాషీ కాదు. ప్రస్తుతం తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. మరిన్ని ఛాన్సులు సినిమాలలో రావాలని కోరుకుందాం.







