Thursday, 15 October 2026

జిల్లా కోర్టులలో జాబ్స్ కోసం నోటిఫికేష‌న్

newsseals-TelanganaCourtJobs

రిలీజ్ చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 859 పోస్టుల భర్తీకి టీజీహెచ్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 2026 జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే అప్లై చేసకోవాల్సి ఉంటుంది. మొత్తం 859 పోస్టులను భర్తీ చేస్తుండగా వీటిలో 319 ఆఫీస్ స‌బార్డినేట్ , 159 జూనియ‌ర్ అసిస్టెంట్ , 95 ప్రాసెస్ స‌ర్వ‌ర్ , కాపీయిస్ట్ పోస్టులు 63 ఉన్నాయి. వీటితో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు 61, ఎగ్జామిన‌ర్ 49 పోస్టులు, టైపిస్టులు 42, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు 36 , స్టెనో గ్రాఫ‌ర్ గ్రేడ్ -3 కు సంబంధించి 35 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 859 ఉన్నాయ‌ని పేర్కొంది.

ఇదిలా ఉండ‌గా ఆయా జాబ్స్ కు సంబంధించి అర్హ‌త‌లు ఉన్నాయి. ఆయా పోస్టుల‌కు సంబంధించి
7, పదో తరగతి తరగతి, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలానే తప్పకుండా కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) , కొన్ని పోస్టులకు నైపుణ్య పరీక్ష (Skill Test/Typing) ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.22,900 నుండి రూ. 96,890 వరకు (పోస్టును బట్టి) వేతనం లభిస్తుంది. వయోపరిమితి ప‌రంగా చూస్తే 18 నుంచి 46 ఏళ్లు లోపు వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.600.. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, పీడబ్ల్యూడీ,ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.400. ఫిబ్ర‌వ‌రి 13వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *