ప‌ద్మ పుర‌స్కార గ్ర‌హీత‌ల‌కు అభినంద‌న‌లు

Spread the love

తెలియ చేసిన మంత్రి నారా లోకేష్

అమ‌రావ‌తి : 2026 గానూ కేంద్ర ప్రభుత్వం ప్ర‌క‌టించిన‌ పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వెలుగుల‌కు అభినంద‌న‌లు తెలియ చేశారు రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు ప‌ద్మ‌భూష‌ణ్, సినీనటుడు గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్ , మాగంటి మురళీ మోహన్ (క‌ళ‌లు) కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్), పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి (వైద్యం), గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (కళలు), డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ ( సైన్స్), వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్యం), గూడూరు వెంకట్రావు (వైద్యం) , దీపికారెడ్డి (నృత్యకారిణి), గడ్డమనుగు చంద్రమౌళి (సైన్స్ విభాగం), యూజీసీ మాజీ చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్‌ల‌కు ప‌ద్మ‌శ్రీ వ‌రించ‌డం చాలా సంతోషంగా ఉందన్నారు.

త‌మ త‌మ రంగాల‌లో విశిష్ట సేవ‌లు అందించి తమదైన ముద్ర వేసిన‌ ప్ర‌ముఖుల‌కు అత్యున్న‌త పుర‌స్కారాలు ప్ర‌క‌టించ‌డం స‌ముచితంగా ఉంద‌న్నారు. తెలుగువారి ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసి ప‌ద్మ అవార్డులకు ఎంపికైన‌ స్ఫూర్తి ప్ర‌దాత‌ల‌కు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నానని పేర్కొన్నారు నారా లోకేష్‌. త‌మ ప్ర‌భుత్వం కూడా త్వ‌ర‌లో త‌మ రాష్ట్రం త‌ర‌పున ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాల‌కు ఎంపికైన వారికి స‌న్మానం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇటీవలే త‌మ స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో సాంస్కృతిక వైభ‌వాన్ని చాటి చెప్పేలా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌న్నారు.

  • Related Posts

    అగ్ని ప్ర‌మాదాల‌పై హైడ్రా అవ‌గాహన‌

    Spread the love

    Spread the loveశ్రీ‌కారం చుట్టిన క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో వ‌రుస‌గా అగ్ని ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవ‌లే నాంప‌ల్లి లోని ఫ‌ర్నీచ‌ర్ షో రూంలో భారీ ప్ర‌మాదం చోటు చేసుకుంది.…

    త్యాగ ధ‌నుడు రావి నారాయ‌ణ రెడ్డి

    Spread the love

    Spread the loveమ‌హ‌నీయుడ‌న్న సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం, పేదల హక్కుల కోసం పోరాటం చేయడమే కాదు, సర్వం త్యాగం చేసిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి అని కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *