దివ్యాంగుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లు

కేటాయించామ‌న్న మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క

ఖ‌మ్మం జిల్లా : డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ స‌ర్కార్ దివ్యాంగుల సంక్షేమం కోసం భారీ ఎత్తున నిధుల‌ను కేటాయించింద‌ని చెప్పారు. ఖ‌మ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలోనే దివ్యాంగుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లు ఖర్చు చేయడం జరిగింద‌ని అన్నారు డిప్యూటీ సీఎం.

దివ్యాంగ విద్యార్థులకు ఐప్యాడ్లు, ల్యాప్‌టాప్‌లు అందిస్తూ వారి ఉన్నత చదువులకు ప్రభుత్వం భరోసానిస్తోందని అన్నారు. అంగవైకల్యం అనేది ఎదిగేందుకు అడ్డంకి కాకూడదని, వారిని సమాజంలో మనతో సమానంగా గౌరవప్రదమైన స్థితిలోకి తీసుకు రావడమే మా లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. దివ్యాంగులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చూస్తూ, ప్రతి అడుగులోనూ ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ‌లో కాంగ్రెస్ స‌ర్కార్ ప‌ని చేస్తోంద‌న్నారు. ఇప్ప‌టికే ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంద‌ని చెప్పారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *