వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాల్గొన‌డంపై పాకిస్తాన్ నో క్లారిటీ

Spread the love

ఫిబ్ర‌వ‌రి నెల‌లో బిగ్ టోర్న‌మెంట్ ప్రారంభం

లాహోర్ : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వ‌ర్యంలో ఫిబ్ర‌వ‌రి నెల‌లో బిగ్ టోర్నీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే ప‌లు జ‌ట్లు పాల్గొంటున్నాయి. ఈ సంద‌ర్బంగా భ‌ద్ర‌తా కార‌ణాల సాకు చూపించి బంగ్లాదేశ్ జ‌ట్టు టోర్నీ నుంచి నిష్క్ర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది బంగ్లాదేవ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) . ఇదే క్ర‌మంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సైతం బంగ్లాదేశ్ జ‌ట్టుకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. దీంతో పాకిస్తాన్ బోర్డు చీఫ్ న‌ఖ్వీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాము పాల్గొనాలా లేదా అనే దానిపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. త‌మ‌కు వారం రోజుల గ‌డువు కావాల‌ని కోరారు. ఇందుకు సంబంధించి ఫైన‌ల్ డెసిష‌న్ త‌మ చేతుల్లో ఉండ‌ద‌ని, అది కేవలం పాకిస్తాన్ దేశ ప్ర‌భుత్వంపై ఆధార‌ప‌డి ఉంటుంద‌న్నారు.

అయితే భారీ ఎత్తున నష్ట పోవాల్సి ఉంటుంది పాకిస్తాన్ బోర్డు. ఇప్ప‌టికే ఆయా స్పాన్స‌ర్ షిప్ కుదుర్చుకున్న కంపెనీలు ఒక‌వేళ పాక్ పాల్గొన‌క పోతే దాదాపు రూ. 350 కోట్ల‌కు పైగా న‌ష్ట పోతాయి. దీంతో ఇప్ప‌టికే చ‌సుకున్న ఒప్పందం మేర‌కు పాకిస్తాన్ బోర్డు ఈ భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అంత భారీ మొత్తాన్ని చెల్లించే స్థోమ‌త పీసీబీకి లేదు. ఆ విష‌యం ఆ దేశానికి, పీసీబీ బోర్డు చీఫ్ న‌ఖ్వీకి కూడా తెలుసు. దీంతో టి20 టోర్నీలో పాల్గొనేందుకే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. అయితే ఐసీసీ ఇప్ప‌టికే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు ఆడ‌క పోయినా త‌మ‌కు వ‌చ్చే న‌ష్టం ఏమీ లేద‌ని స్ప‌ష్టం చేసింది.

  • Related Posts

    సంజూ శాంస‌న్ అద్భుత‌మైన బ్యాట్స్ మెన్

    Spread the love

    Spread the loveబీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. ఫామ్ లోకి రావ‌డం…

    ప్లాన్ లో భాగంగానే వికెట్ కీప‌ర్ గా ఇషాన్ కిష‌న్

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కెప్టెన్ సూర్య భాయ్ కేర‌ళ : కేర‌ళ లోని తిరువ‌నంత‌పురం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన 5వ టి20 మ్యాచ్ అనంత‌రం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు భార‌త జ‌ట్టు కెప్ట‌న్ సూర్య కుమార్ యాద‌వ్. త‌ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *