సంజూ శాంస‌న్ కు బీసీసీఐ బిగ్ షాక్

Spread the love

కాంట్రాక్టు కింద సి కేట‌గిరి లోకి మార్పు

ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ కు కోలుకోలేని షాక్ తగిలింది. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఝ‌ల‌క్ ఇచ్చింది. ప్ర‌తి ఏటా బీసీసీఐ ఆయా ఆట‌గాళ్ల‌కు సంబంధించి ఒప్పందం జాబితాను ప్ర‌క‌టిస్తుంది. ఇందులో మూడు కేట‌గిరీలు ఉంటాయి. ప్ర‌తిభ, అనుభ‌వం ఆధారంగా క్రికెట‌ర్ల‌ను చేరుస్తుంది. ఇక ఈ ఏడాది అంత‌గా క‌లిసి రాలేదు సంజూ శాంస‌న్ కు. దేశివాళి పోటీల్లో దుమ్ము రేపి, ప‌రుగుల వ‌ర‌ద పారించిన త‌ను న్యూజిలాండ్ తో జ‌రిగిన టి20 సీరీస్ లో తేలి పోయాడు. ఐదు మ్యాచ్ లు ఆడితే కేవ‌లం 50 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.

ఇందులో 10, 6, 0, 6, 24 రన్స్ మాత్ర‌మే ఉన్నాయి. దీంతో త‌ను చేజేతులారా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి నిష్క్ర‌మించాడు. త‌న‌ను బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ ప‌ట్టించు కోలేదు. ఇదిలా ఉండ‌గా తాజాగా బీసీసీఐ ప్ర‌క‌టించిన కాంట్రాక్టు కు సంబంధించిన వివ‌రాల‌ను అధికారికంగా వెల్ల‌డించారు బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సి – కేట‌గిరీలో అక్ష‌ర్ ప‌టేల్, తిల‌క్ వ‌ర్మ‌, శివ‌మ్ దూబే, సంజూ శాంస‌న్, అర్ష్ దీప్ సింగ్, ప్ర‌సిద్ద కృష్‌ణ‌, ఆకాష్ దీప్ , ధ్రువ్ జురేల్ , హ‌ర్షిత్ రాణా, వ‌రుణ్ , నితీష్ రాణా, అభిషేక్ శ‌ర్మ‌, సాయి సుద‌ర్శ‌న్ , బిష్ణోయ్, రుతురాజ్ ఉన్నార‌ని తెలిపారు రాజీవ్ శుక్లా.

  • Related Posts

    గుజ‌రాత్ టైటాన్స్ ఓట‌మిపై కోచ్ నెహ్రా సీరియ‌స్

    Spread the love

    Spread the loveఅగ్ర‌శ్రేణి బ్యాట‌ర్ల వైఫ‌ల్యం కొంప ముంచింది అహ్మ‌దాబాద్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ టైటిల్ ను ఆడుతూ పాడుతూ కైవ‌సం చేసుకుంది ర‌జ‌త్ పాటిదార్ సారథ్యంలోని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌లూరు (ఆర్సీబీ). తొలుత బ్యాటింగ్ చేసిన ప్ర‌త్య‌ర్థి గుజ‌రాత్…

    ఆశించిన రీతిలో ఆడ‌లేక పోయాం : గిల్

    Spread the love

    Spread the loveఆర్సీబీ చేతిలో 5 వికెట్ల తేడాతో ప‌రాజ‌యం అహ్మ‌దాబాద్ : ఐపీఎల్ 19 సీజ‌న్ ఫైన‌ల్ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌లూరు చేతిలో ఓట‌మి పాల‌య్యాక స్పందించాడు గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్. టైటిల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *