ప్ర‌భుత్వ స్థ‌లాలు ఆక్ర‌మిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు

Spread the love

స్ప‌ష్టం చేసిన క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్

హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎవ‌రైనా స‌రే , ఏస్థాయిలో ఉన్నా స‌రే ప్ర‌భుత్వానికి సంబంధించిన స్థ‌లాల‌ను ఆక్ర‌మిస్తే తోలు వ‌లుస్తామ‌ని, చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు. ప్ర‌జా వాణి సంద‌ర్బంగా బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇదిలా ఉండ‌గా గ‌చ్చి బౌలిలోని టీఎన్‌జీవో కాల‌నీ లే ఔట్ వేసిన‌ప్పుడు సెప్టిక్ ట్యాంకుతో పాటు వాట‌ర్‌ట్యాంక‌ర్‌కు స్థ‌లాన్ని కేటాయించారు. అక్క‌డ కొంత మందికి ప్లాట్లు రాగా.. వేరే చోట‌కు త‌ర‌లించారు. ఇప్ప‌డు ఆ వాట‌ర్ ట్యాంక‌ర్‌, సెప్టిక్ ట్యాంక‌ర్ ప్రాంతంలో ప్లాట్లు వేసి విక్ర‌యించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నార‌ని, ఆ స్థ‌లాన్ని ప్ర‌జావ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా కాపాడాల‌ని హైడ్రాను అక్క‌డి నివాసితులు కోరారు.

మ‌ణికొండ ల్యాంకోహిల్స్‌కు చేరువలో ఉన్న ఎల్ల‌మ్మ చెరువును న‌లువైపులా క‌బ్జాలు చేశార‌ని, అక్క‌డ రేసు కోర్సు, క్రికెట్ క్రీడాస్థ‌లం, ప‌క్క‌నే పార్కింగ్‌తో పాటు రియ‌ల్ట‌ర్లు కూడా క‌బ్జాలు చేస్తున్నార‌ని.. ఇటీవ‌ల 3 నెల‌ల్లో అక్క‌డ ఒక భ‌వ‌నం నిర్మాణం జ‌రిగింద‌న్నారు. వెంట‌నే చెరువు హ‌ద్దుల‌ను నిర్ధారించి ఆక్ర‌మ‌ణ‌ల‌ను నియంత్రించాల‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి కాకుండా చూడాల‌ని కోరారు. హైటెక్స్ ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌కు సమీపంలోని ఖానామెట్‌లో ఆల్ ఇండియా వెల‌మ సంఘానికి 5ఎక‌రాలు ప్ర‌భుత్వం కేటాయించింది. ఈ స్థ‌లం చుట్టూ ప్రీకాస్ట్ వాల్‌తో ప్ర‌హ‌రీ నిర్మిస్తుండ‌గానే.. కుల సంఘాల‌కు స్థ‌లాలు కేటాయించ‌డంపై కొంత‌మంది కోర్టుకెక్క‌డంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఇదే అద‌నుగా ఆ స్థ‌లాన్ని వెనుక వైపు నుంచి అక్క‌డ ఉన్న స్థానికులు మ‌ట్టిపోస్తూ క‌బ్జా చేస్తున్నార‌ని.. అదేమ‌ని అడిగితే వాచ్‌మ్యాన్‌పై దాడి చేస్తున్నార‌ని ఆ సంఘం ప్ర‌తినిధులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు.

  • Related Posts

    తిరుప‌తి న‌గ‌ర భ‌విష్య‌త్తుకి బ‌డ్జెట్ ఉప‌యోగ ప‌డాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష‌తిరుప‌తి : మ‌నం ప్ర‌తిపాదించి, ఆమోదించిన బ‌డ్జెట్ తిరుప‌తి న‌గ‌ర భ‌విష్య‌త్తుకు ఉప‌యోగ‌ప‌డే విధంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష‌. బడ్జెట్ ప్రతిపాదనలు, మన చర్చలను పరిశీలించిన తిరుపతి నగర…

    శ్రీ చైతన్య స్కూల్ టీచ‌ర్ నిర్వాకం..సంచ‌ల‌నం ..?

    Spread the love

    Spread the loveమాయ మాట‌లు చెప్పి విద్యార్థినితో ర‌హ‌స్యంగా పెళ్లి హైద‌రాబాద్ : రోజు రోజుకు స్కూళ్ల‌కు పిల్ల‌ల‌ను పంపించాలంటే పేరెంట్స్ జ‌డుసుకునే ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌తి రోజూ ఏదో ఒక స‌మాచారం బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉంది. ప‌లు చోట్ల లైంగిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *