డిమాండ్ చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు
విజయవాడ : తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని సిట్ తేల్చిందని దీంతో నిన్నటి దాకా రాజకీయం చేస్తూ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి నారా లోకేష్ బేషరతుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. మంగళవారం అవినాష్ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు వాస్తవాలు బయటకు వచ్చాయన్నారు. కల్తీ జరిగింది అని చెప్పిన ట్యాంకర్లన్నీ తనిఖీ చేసి పంపించింది కూటమి ప్రభుత్వమే నని పేర్కొన్నారు. దీనిలో వైసీపీ కి సంబంధం ఏమి ఉందో చెప్పాల్సిన అవసరం సీఎం, డిప్యూటీ సీఎంలపై ఉందన్నారు దేవినేని అవినాష్.
సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందన్నారు. అయినా వీరికి బుద్ది రాలేదన్నారు. సోయి లేకుండా మాట్లాడటం అలవాటుగా మారందన్నారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. హిందువులకు అండగా ఇప్పటి వరకు ఉన్నది తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డినేనని తేలి పోయిందన్నారు. టీటీడీ లడ్డు ప్రసాదం పై అపనమ్మకం తీసుకొచ్చిందన్నారు.
2014-19 మధ్య వందలాది హిందీ గుడులు కూల్చింది తన హయాంలోనేనని పేర్కొన్నారు. శ్రీశైలంలో శివ భక్తుల మీద పోలీసులు దారుణంగా దాడి చేశారని, ఇందుకు సంబంధించి వీడియోలు చూసిన భక్తులు తీవ్ర ఆవేదనతో ఉన్నారని అన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీడియాపై చిందులు వేస్తున్నారని ఆరోపించారు.






