ఉద‌య్ పూర్ లో ఒక్క‌టి కానున్న దేవ‌ర‌కొండ‌, మంద‌న్నా

Spread the love

మార్చి 4న హైద‌రాబాద్ లో వివాహ రిసెప్ష‌న్

హైద‌రాబాద్ : పుకార్ల‌కు పుల్ స్టాప్ పెట్టేశారు. గాసిప్స్ కు ఛాన్స్ లేకుండా చేశారు. తామిద్ద‌రం పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఉత్కంఠ‌కు తెర దించారు. ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా చేశారు ప్ర‌ముఖ న‌టీ న‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ , ర‌ష్మిక మంద‌న్నా. ఈ ఇద్ద‌రూ ల‌వ్ లో ప‌డ్డారు ప‌రుశురామ్ తీసిన గీత గోవిందం మూవీ షూటంగ్ స‌మ‌యంలో. ఇక మంద‌న్నా స్వ‌స్థ‌లం క‌ర్ణాట‌క‌. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ‌ది ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా. ఈ ఇద్ద‌రూ అనుకోకుండా క‌లుసుకున్నారు. ఆ త‌ర్వాత పీక‌ల లోతు ప్రేమ‌లో ప‌డి పోయారు. మొద‌ట అదేమీ లేద‌న్నారు . ఆ త‌ర్వాత విదేశాల‌లో క‌లిసి తిరిగిన ఫోటోలు హ‌ల్ చ‌ల్ అయ్యాయి. చివ‌ర‌కు ఉంగ‌రాలు మార్చుకున్నారు. భారీ ఎత్తున పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నాల పెళ్లి ఫిబ్ర‌వ‌రి 26న రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ వేదిక కానుంది. సినీ, వ్యాపార‌, వాణిజ్య‌, క్రీడా, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఈ వివాహానికి హాజ‌రు కానున్నారు. పెళ్లి అయ్యాక రిసెప్ష‌న్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ లో జ‌రుగుతుంద‌ని టాలీవుడ్ లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చే నెల మార్చి 4న దీనికి ముహూర్తం ఖ‌రారు చేసిన‌ట్లు టాక్. ఈ ఇద్ద‌రూ హెరిటేజ్ ప్యాలెస్ లో ఒక్క‌టి కాబోతున్నారు. వాస్త‌వానికి ఫిబ్ర‌వ‌రి 2నే పెళ్లి చేసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ అది వాయిదా ప‌డింది. చివ‌ర‌కు 26వ తేదీ ఖ‌రారైంది. ఈ ఇద్ద‌రి వివాహానికి సంబంధించి వీడియో ట్రెండింగ్ లో ఉంది.

  • Related Posts

    సీతా ప‌య‌నం ట్రైలర్ విడుదల

    Spread the love

    Spread the loveఅర్జున్ సర్జా యాక్షన్ , లవ్ ట్రీట్ యాక్షన్ కింగ్ అర్జున్ తన బ్యానర్ శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కింద నిర్మించిన సీత పయనం తో తిరిగి వచ్చాడు. ఈ చిత్రంలో త‌న కూతురు ఐశ్వర్య అర్జున్…

    జ‌న నాయ‌కుడితో జ‌న నాయ‌గ‌న్

    Spread the love

    Spread the loveచెన్నై వెడ్డింగ్ లో క‌లుసుకున్న నేత‌లు చెన్నై : చెన్నై వేదిక‌గా జ‌రిగిన వివాహ వేడుక‌లో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, టీవీకే పార్టీ చీఫ్ ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *