newsseals.com
News

నేపాల్ కేబినెట్ లో మ‌హిళా జ‌ర్న‌లిస్ట్

VijayaBhaskar March 28, 2026
newsseals-PratibhaRawal
Spread the love

సంచ‌ల‌నంగా మారిన ప్ర‌తిభా రావ‌ల్

ఖాట్మండు : నేపాల్ దేశంలో కొత్త‌గా మంత్రివ‌ర్గం కొలువు తీరింది. శ‌నివారం అనుకోని ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. గ‌త ఏడాదిలో జ‌రిగిన హింస‌కు కార‌ణం మాజీ ప్ర‌ధాని అని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ త‌రుణంలో తాజాగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన కేబినెట్ లో ఓ మ‌హిళ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాను ఎవ‌రో కాదు మ‌హిళా జ‌ర్న‌లిస్టుగా గ‌తంలో ప‌ని చేసిన ప్ర‌తిభా రావ‌ల్. త‌ను చెన్నైలో ఏషియ‌న్ స్కూల్ ఆఫ్ జ‌ర్న‌లిజం ఇనిస్టిట్యూట్ లో చ‌దువుకున్నారు. యువ రాజకీయ నాయకురాలుగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె నెపాల్ కేంద్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కీల‌క శాఖ‌లు అప్ప‌గించారు పీఎం. ఫెడ‌ర‌ల్ అఫైర్స్ , జ‌న‌ర‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ , ల్యాండ్ మేనేజ్మెంట్, కోఆప‌రేటివ్స్ , పేద‌రిక నిర్మూల‌న శాఖ‌ల‌ను అప్ప‌గించారు ప్ర‌తిభా రావ‌ల్ కు. రాష్ట్రీయ స్వ‌తంత్ర పార్టీలో కీ రోల్ పోషిస్తోంది. త‌ను ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. త‌ను తొలుత జ‌ర్న‌లిస్టుగా త‌న కెరీర్ ను ప్రారంభించింది. ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి ఎంట‌రైంది. బయట నుంచి ప్రశ్నించడం సరిపోదు, పాలసీ స్థాయిలో పని చేయాలి అనే ఆలోచనతో రాజకీయాల్లోకి రావ‌ల్సి వ‌చ్చింద‌ని ఒకానొక సంద‌ర్బంగా చెప్పింది. పార్టీ ప‌రంగా అధికార ప్ర‌తినిధిగా ప‌ని చేసింది. యువ‌త నుంచి వ‌చ్చిన కొత్త త‌రం నాయ‌కురాలిగా ఇప్ప‌టికే ప్ర‌శంస‌లు అందుకుంటోంది.