ఉగ్ర కదలికల పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ చీఫ్ మాధ‌వ్

అమ‌రావ‌తి : ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు వీవీఎన్ మాధ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉగ్ర క‌ద‌లిక‌ల ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వీరి క‌ద‌లిక‌ల ప‌ట్ల కూట‌మి ప్ర‌భుత్వం ఫుల్ ఫోక‌స్ పెట్టింద‌ని పేర్కొన్నారు. బెజవాడ కేంద్రం గా దర్యాప్తు ప్రారంభమై ఇతర ప్రాంతాల తో సహా 12 మంది అరెస్టు అయిన నేపథ్యంలో అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. ఎటువంటి సమాచారం తెలిసినా వెంట‌నే ప్రభుత్వానికి సమాచారం అందించడానికి పౌరులు సిద్ధంగా ఉండాలని పివిఎన్ మాధవ్ పిలుపు ఇచ్చారు. రాయచోటి సంఘటన తర్వాత ఉగ్ర కదలికల వివిధ రూపాల్లో బయట పడుతున్నాయని పేర్కొన్నారు.

గతం లో విజయవాడ కేంద్రంగా రొహింగ్యాలు పట్టుబడి న సంఘటనలు కూడా చూశామ‌ని అన్నారు పీవీఎన్ మాధ‌వ్. అయితే తాజాగా సోషల్ మీడియా మాధ్యమం గా ఉగ్ర భావజాలాన్ని విస్తరింప చేసే ముఠా ను దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసి న నేపథ్యం లో పౌరులు భాద్యతాయుతంగా వ్య‌వ‌హ‌రించాని పేర్కొన్నారు. దేశ భద్రత దృష్టిలో ఉంచుకుని ఇటువంటి వారి పట్ల జాగ్రత్త గా ఉండాల‌న్నారు. దర్యాప్తు సంస్థ లకు, పోలీసులు కు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మనందరికీ ఉందని మాధవ్ పేర్కొన్నారు . ఉగ్ర కదలికల లో దర్యాప్తు సంస్థలు అదుపు లోకి తీసుకున్న తర్వాత వారు కాకమ్మ కధలు చెబితే నమ్మ వద్దని మాధవ్ అద‌న్నారు.

  • Related Posts

    బాధితుల‌కు మెరుగైన వైద్యం అందించాలి

    Spread the love

    Spread the loveఆదేశించిన మంత్రి నిమ్మ‌ల రామానాయుడు అమరావతి : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సీతాలం కొండేపాడు ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీల తో…

    ఆస్ట్రేలియా హైకమిషనర్‌తో సీఎం భేటీ

    Spread the love

    Spread the loveకీల‌క రంగాల‌లో స‌హ‌కారం పై చ‌ర్చ‌లు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస్ట్రేలియా హై క‌మిష‌న‌ర్ తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి కీల‌క రంగాల‌లో స‌హ‌కారంపై చ‌ర్చించారు. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ-సాంకేతికత,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *