ప్రాధాన్య‌త క్ర‌మంలో ప‌నులు చేప‌డ‌తాం

Spread the love

అర్థవంతమైన చర్చలు జరగాల‌న్న డిప్యూటీ సీఎం

అమ‌రావ‌తి : ప్రాధాన్య‌త క్ర‌మంలో చేప‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. శాస‌న స‌భ‌లో పాల్గొన్న అనంత‌రం మీడియాతో మాట్లాడారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యే, ఎంపీలు, ఎస్పీ, కలెక్టర్లతో ఉమ్మడి సమావేశం నిర్వహిస్తాం అన్నారు. పొలిటికల్ గవర్నెన్స్‌లో భాగంగా ఎమ్మెల్యేల గౌరవాన్ని పెంచుతామ‌ని స్ప‌ష్టం చేశారు. నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు గుర్తిస్తే ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేద్దాం అన్నారు. మనం చేసే అభివృద్ది కార్యక్రమాలు ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. మనం ఇంకా పూర్తిగా కోలుకోలేదన్న విషయం గుర్తించాల‌న్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. కానీ వ్యవస్థలను గాడిన పెట్టాం అన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా నియోజకవర్గాల్లో చేసిన పనులను ఎమ్మెల్యేలు ఓన్ చేసుకోవాలని స్ప‌ష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలను సభ్యులు సీరియస్‌గా తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు.

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సభ్యులు అంతా సభలో ఉండాల్సిందేన‌ని చెప్పారు. నేను కూడా సభను పూర్తిగా ఫాలో అవుతాన‌ని అన్నారు… సభ్యుల ప్రసంగాలు, మంత్రులు సమాధానాలు వింటాను. సభలో సబ్జెక్టులపై అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ప‌వ‌న్ కళ్యాణ్.
త‌మ సమస్యలపై మా ఎమ్మెల్యేలు మాట్లాడారు, మంత్రులు సమాధానం చెప్పారు అని ప్రజలు అనుకోవాలి. విప్‌లు సంతృప్తికరంగా పని చేయాలి. ఎదుటివారు తిట్టారని మనం కూడా బూతులు తిట్టకూడదని సూచించారు . ప్రజల ఆమోద యోగ్యంగా సభ జరగాలని పేర్కొన్నారు అని సీఎం చంద్రబాబు అన్నారు.

  • Related Posts

    మామునూరు ఎయిర్ పోర్టు ప‌నులు ప్రారంభించాలి

    Spread the love

    Spread the loveకేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడుతో రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న ఎంపీల‌తో క‌లిసి ఢిల్లీలో కేంద్ర రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్…

    మ‌న్రేగా ప‌థ‌కం పేద‌ల పాలిట వ‌రం

    Spread the love

    Spread the loveనిర్వీర్యం చేసిన కేంద్ర ప్ర‌భుత్వం నెల్లూరు జిల్లా : మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం ఆనాడు కోట్లాది మంది పేద‌ల‌కు అన్నం పెట్టింద‌ని, కూలీల‌కు ప‌ని క‌ల్పించింద‌ని కానీ మోదీ స‌ర్కార్ వ‌చ్చాక దానిని నిర్వీర్యం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *