రూ. 1000 కోట్ల విలువైన రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ ఇస్తాం
హైదరాబాద్ : రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే వన్నాడ ప్రకాశ్ గౌడ్ సంచలన ప్రకటన చేశారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్ వాసులకు ఖుష్ కబర్ చెప్పారు. అక్కడ నష్టపోతున్న వారందరికీ రూ. 1000 కోట్ల విలువైన రెడీ టు ఆక్యుపై గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ ఇస్తామని చెప్పారు. గురువారం ఆయన బాధితులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు . తాను మీకు అండగా ఉంటానని స్పష్టమైన హామీ ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా 5000 కోట్లతో నిర్మించబోయే గాంధీ విగ్రహం కోసం భూ సేకరణ చేస్తున్నారు. ఇందులో భాగంగా మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ 450 ఫ్లాట్స్ వాసులకు తీరని నష్టం జరుగుతుంది. దీంతో బాధితుల ఆందోళనను , ఆవేదనను అర్థం చేసుకున్నారు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్. న్యాయం జరిగేలా అదే విస్తీర్ణంలో (Same SFT) వేరే సురక్షితమైన గెటెడ్ కమ్యూనిటీలో ‘Ready to Occupy’ ఫ్లాట్లను కేటాయించడం జరుగుతుందని స్పష్టం చేశారు. లేదా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేటు ప్రకారం తగిన నష్టపరిహారం చెల్లిస్తామన్నారు.
కాగా ఇదే తరహాలో నష్టపోతున్న కిస్మత్ పూర్, ఇతర మూసీ ప్రాంతాలు, ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు ఇలాగే నష్ట పరిహారం చెల్లిస్తారా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది.





