నెత‌న్యాహూతో ప్ర‌ధాన‌మంత్రి మోదీ భేటీ

Spread the love

కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన దేశాధినేత‌లు

ఇజ్రాయెల్ : ఇజ్రాయెల్ లో ప‌ర్య‌టిస్తున్నారు భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఈ సంద‌ర్భంగా ఇజ్రాయెల్ దేశ ప్ర‌ధాన మంత్రి బెంజిమ‌న్ నెత‌న్యూహూతో భేటీ అయ్యారు. ఈ ఇరువురు దేశాధినేత‌లు రెండు గంట‌ల‌కు పైగా స‌మావేశం అయ్యారు. ఈ ఇద్ద‌రి భేటీ పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. నెత‌న్యాహూతో జ‌రిగిన సంభాష‌ణ‌లు ఫ‌ల‌ప్ర‌దం అవుతాయ‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఆయ‌న స్వంత సామాజిక వేదిక ఎక్స్ ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

ముందుగా త‌న‌కు లభించిన ఆత్మీయ స్వాగతం కోసం కృతజ్ఞతలు తెలియజేస్తున్న‌ట్లు తెలిపారు. 9 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్‌కు తిరిగి రావడం ఆనందంగా ఉందన్నారు ప్ర‌ధాన‌మంత్రి మోదీ. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో విస్తృత శ్రేణి అంశాలపై తాము చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. సాంకేతికత, నీటి నిర్వహణ, వ్యవసాయం, ప్రతిభ భాగస్వామ్యం వంటి రంగాలు సన్నిహిత సహకారానికి అపారమైన అవకాశాలను అందిస్తున్నాయని తెలిపారు మోదీ. ఈ ప్రాంతంలోని కీలక పరిణామాలను కూడా చ‌ర్చింన‌ట్లు వెల్ల‌డించారు. ఇరు దేశాలు బ‌ల‌మైన బంధాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకునే దిశ‌గా అడుగులు వేసిన‌ట్లు తెలిపారు మోదీ.

  • Related Posts

    పోలవరం-నల్లమల సాగర్ లింకు రాష్ట్రాలకూ లాభమే

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం శాస‌న స‌భలో ప‌లువురు స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కూల్ గా స‌మాధానం ఇచ్చారు.…

    7న మిట్ట‌ల్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాప‌న‌

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి కొల్లు ర‌వీంద్ర అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి వ‌ల్ల రాష్ట్రంలో అతి పెద్ద ఉక్కు ఆధారిత ప‌రిశ్ర‌మ రాబోతోంద‌ని , ఇందుకు త్వ‌ర‌గా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *