పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్
పాకిస్తాన్ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ , ప్రముఖ కామెంటేటర్ , అనలిస్ట్ వసీం అక్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా కోల్ కతా వేదికగా జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు విండీస్ ను 5 వవికెట్ల తేడాతో ఓడించింది. గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో భారత జట్టు గెలుస్తుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కోట్లాది మంది ఈ మ్యాచ్ ను కళ్లప్పగించి వీక్షించారు. అనంతరం 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే రెండు కీలకమైన వికెట్లను కోల్పోయింది. వారిలో ఒకరు అభిషేక్ శర్మ కాగా మరొకరు ఇషాన్ కిషన్.
ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా ఎక్కడా తొట్రుపాటుకు లోను కాలేదు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్. తను ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 50 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు 4 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. చివరి వరకు ఉన్నాడు. ఈ తరుణంలో మ్యాచ్ గెలుపొందడమే కాకుండా జట్టును సెమీ ఫైనల్ కు చేర్చడంలో కీలక భూమిక పోషించాడు సంజూ శాంసన్. తన ఆట తీరుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రం ఇవాళ స్పందించాడు. తను అద్బుతమైన ప్లేయర్ అంటూ కితాబు ఇచ్చాడు. భారతదేశం సెమీ-ఫైనల్స్‌కు వెళుతుందని , దాదాపుగా ఫైనల్స్ కూడా ఆడుతుందని నాకు తెలుసు అని అన్నాడు. కానీ సంజు సామ్సన్‌కు మొదటి కొన్ని మ్యాచ్‌లలో ఎందుకు అవకాశం రాలేదో నాకు అర్థం కాలేదని పేర్కొన్నాడు. ఈరోజు అతను చేసిన 97 పరుగులు అందరి నోళ్లను మూయించాయంటూ ప్రశంసలు కురిపించాడు.





