శాంస‌న్ ఆడిన ఇన్నింగ్స్ అద్బుతం : అమీర్

Spread the love

నిన్న టీం ఇండియాపై షాక్ కామెంట్స్
పాకిస్తాన్ : ఎట్టి ప‌రిస్థితుల్లో టీం ఇండియా సెమీ ఫైన‌ల్ కు వెళ్ల‌ద‌ని, వెస్టిండీస్ తో త‌ప్ప‌కుండా ఓడి పోతుందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు పాకిస్తాన్ కు చెందిన మాజీ క్రికెట‌ర్ మొహ‌మ్మ‌ద్ అమీర్. కానీ ఆయ‌న అంచ‌నాలు పూర్తిగా త‌ప్పాయి. భార‌త జ‌ట్టు కోల్ క‌తా వేదిక‌గా విండీస్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ద‌ర్జాగా సెమీ ఫైన‌ల్ కు చేరుకుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 195 ప‌రుగులు చేసింది. అనంత‌రం మైదానంలోకి దిగిన టీం ఇండియా ఊహించ‌ని రీతిలో ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండ‌గానే గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. మొద‌టి నుంచి ఆఖ‌రి ఓవ‌ర్ దాకా నిలిచే ఉన్నాడు మైదానంలో స్టార్ ఓపెన‌ర్ కేర‌ళ‌కు చెందిన సంజూ శాంస‌న్ .

త‌ను 50 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు 4 సిక్సుల‌తో రెచ్చి పోయాడు. 97 ప‌రుగులు చేసి ఇండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. ఈ సంద‌ర్బంగా మొహ‌మ్మ‌ద్ అమీర్ స్పందించాడు. త‌ను ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం అంటూ కితాబు ఇచ్చాడు. సంజు సామ్సన్ తన జీవితంలో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. నేను IPLలో కూడా అతని బ్యాటింగ్ చూశాను కానీ అధిక ఒత్తిడి, నాకౌట్ ఆటలో అతను ఆడిన అత్యుత్తమ ఆట ఇది. దానికి తగిన చోట క్రెడిట్ ఇవ్వాలని పేర్కొన్నాడు. త‌ను అన్ని ప్రశంసలు అందుకునేందుకు అర్హుడంటూ కితాబు ఇచ్చాడు అమీర్.

  • Related Posts

    సంజు శాంస‌న్ ద‌మ్మున్న క్రికెట‌ర్ : వ‌సీం అక్రం

    Spread the love

    Spread the loveపాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ పాకిస్తాన్ : పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ , ప్ర‌ముఖ కామెంటేట‌ర్ , అన‌లిస్ట్ వ‌సీం అక్రం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా కోల్ క‌తా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్…

    కంగ్రాట్స్ టీం ఇండియా : కొలుసు పార్థ‌సార‌థి

    Spread the love

    Spread the loveసంజూ శాంస‌న్ ఆడిన తీరు అద్బుతం అమ‌రావతి : ఏపీ స‌మాచార శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. టీ-20 వరల్డ్ కప్ సూపర్ 8 చివరి మ్యాచ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *