newsseals.com

రేవంత్ రెడ్డి జేజెమ్మ దిగి వచ్చినా మళ్లీ గెలవ‌డు

March 7, 2026 · VijayaBhaskar

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఈట‌ల రాజేంద‌ర్

నిజామాబాద్ జిల్లా : బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాల‌న గాడి త‌ప్పంద‌న్నారు. అవినీతి, అక్ర‌మాల‌కు కేరాఫ్ గా మారింద‌ని మండిప‌డ్డారు. పేద‌లు, బ‌హుజ‌నుల‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆరు నూరైనా ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని కుట్ర‌ల‌కు తెర లేపినా, ఎన్ని మోస‌పూరిత‌మైన హామీలు ఇచ్చినా ఈసారి జ‌నం కాంగ్రెస్ పార్టీని న‌మ్మ‌ర‌ని అన్నారు. త‌గిన రీతిలో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. అంతే కాదు సీఎం రేవంత్ రెడ్డి మ‌రోసారి గెల‌వ‌డ‌ని జోష్యం చెప్పారు ఈట‌ల రాజేంద‌ర్. రాష్ట్రంలో క‌మ‌లం గాలి వీస్తోంద‌ని చెప్పారు.

న‌రేంద్ర మోదీ స‌మ‌ర్త‌వంత‌మైన నాయ‌క‌త్వం ప్ర‌పంచాన్ని సైతం నివ్వెర పోయేలా చేస్తోంద‌ని అన్నారు .
పీఎంను పార్టీలకు అతీతంగా దేశ ప్రజలంతా అభిమానిస్తున్నారని చెప్పారు. దేశ ప్రజలు కులాలు, మతాలు ప్రాంతాలకు అతీతంగా ‘మా ప్రధాని’ అనుకునే అరుదైన గౌరవం ఒక్క నరేంద్ర మోదీకి మాత్రమే దక్కిందన్నారు. కౌన్సిల‌ర్లుగా, స‌ర్పంచులుగా, వార్డు మెంబ‌ర్లుగా గెలుపొందిన వారంద‌రికీ పేరు పేరునా శుభాకాంక్ష‌లు తెలిపారు ఎంపీ. ఏ విశ్వాసంతో ప్రజలు మనల్ని గెలిపించారో ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఒకసారి నచ్చితే ప్రజలు మన‌ల్ని వదులుకోరని అన్నారు.

Related News