ఇప్ప‌ట్లో టీం ఇండియాను ఓడించ‌డం క‌ష్టం

VijayaBhaskar · March 12, 2026
Spread the love

మాజీ క్రికెట‌ర్, కామెంటేట‌ర్ మైఖేల్ ఆథ‌ర్ట‌న్

ఇంగ్లండ్ : మాజీ క్రికెట‌ర్, ప్ర‌ముఖ క్రికెట్ కామెంటేట‌ర్ మైఖేల్ ఆథ‌ర్ట‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సూర్య కుమార్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. వ‌రుస‌గా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను కైవ‌నం చేసుకుంది. విశ్వ విజేత‌గా నిలిచింది. గ‌తంలో ఉన్న రికార్డుల‌ను తిర‌గ రాసింది. అంతే కాకుండా స్వ‌దేశం క‌ప్ గెల‌వ‌ద‌నే సెంటిమెంట్ ను కూడా ప‌క్క‌న పెట్టేసింది. అత్యంత బ‌ల‌మైన న్యూజిలాండ్ జ‌ట్టును ఫైన‌ల్ లో ఏకంగా 96 ప‌రుగుల భారీ తేడాతో ఓడించింది. క్రికెట్ ప్ర‌పంచాన్ని విస్తు పోయేలా చేసింది.

భార‌త జ‌ట్టు విశ్వ విజేత‌గా నిల‌వ‌డం ప‌ట్ల స్పందించాడు మైఖేల్ ఆథ‌ర్ట‌న్. ప్రపంచ క్రికెట్‌లో భారత జట్టు ఆధిపత్యం కొన‌సాగుతోంద‌ని, దానిని నిలువ‌రించ‌డం చాలా క‌ష్ట‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. టాప్ ఆట‌గాళ్లు కెఎల్ రాహుల్, శుభ్‌మాన్, పంత్, శ్రేయాస్ వంటి ఆటగాళ్ళు ఇప్పటికీ భారత జట్టుకు దూరంగా ఉన్నారని, అంతే కాకుండా రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ కూడా రిటైర్ అయినా ఎక్క‌డా ఇండియా త‌గ్గ‌డం లేద‌న్నాడు. ఇప్పటికీ టీం ఇండియా ప్రపంచ కప్ గెలిచిందన్నాడు, ఇది ప్రస్తుతం ఈ జట్టుకు దగ్గరగా ఉన్న జట్టు లేదని అని పిస్తోంద‌ని చెప్పాడు మైఖేల్ ఆథ‌ర్ట‌న్.