భ‌క్తుల‌కు నిర్దేశిత స‌మ‌యంలోనే అనుమ‌తి

Spread the love

స‌ర్వ ద‌ర్శ‌నం , రూ. 300 ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్లు

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భ‌క్తుల ద‌ర్శ‌నానికి సంబంధించి ప‌లు సూచ‌న‌లు చేశారు ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి ముద్దాడ ర‌విచంద్ర‌, చైర్మ‌న్ బీఆర్ నాయుడు. ఇదిలా ఉండ‌గా స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను వారికి కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలోనే అనుమతించడం జరుగుతుందని స్ప‌ష్టం చేశారు.

ఈ నిబంధనను ఈ వారం నుంచే టీటీడీ కఠినంగా అమలు చేస్తోందని చెప్పారు. భక్తులు తమకు కేటాయించిన సమయానికంటే ముందుగా వచ్చి ఇబ్బంది పడవద్దని సూచించారు . అలాగే సమయం పాటించే భక్తులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. భక్తులందరికీ సౌకర్య వంతమైన, ముంద‌స్తుగ దర్శనం కల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. కాగా పాల‌క‌మండ‌లి తీసుకున్న ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని తమకు కేటాయించిన సమయానికే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని కోరారు ఈవో.

  • Related Posts

    టిటిడి ట్రస్ట్ లకు రూ.20 లక్షల విరాళం

    Spread the love

    Spread the loveఅందించిన రాజేంద్ర జ్యువెల‌రీ సంస్థ‌ తిరుపతి : కోట్లాది మంది భ‌క్తుల‌ను క‌లిగిన ఏకైక ప‌విత్ర స్థ‌లం తిరుమ‌ల‌. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని త‌లుచుకున్నా లేదా ద‌ర్శించుకున్నా, కోరిన కోర్కెలు తీరుతాయ‌ని భ‌క్తుల విశ్వాసం. ఇందులో భాగంగా…

    క‌ళ్యాణ మండ‌పం ఏర్పాటుకు స‌హ‌క‌రిస్తా

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఎంపీ డీకే అరుణ రెడ్డి నారాయ‌ణ‌పేట జిల్లా : మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎంపీ డీకే అరుణ భ‌ర‌త సింహా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరడగం గ్రామంలో శ్రీ సిద్ధ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *