Friday, 16 October 2026

స‌ర‌స్వ‌తి పుత్ర‌కు అనంత శ్రీ‌రామ్ కౌంట‌ర్

newsseals-AnanthaaSriram

పాట‌ల ర‌చ‌యిత మాట‌ల వెనుక ఆంత‌ర్యం ఏమిటి

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ పాపుల‌ర్ గీత ర‌చ‌యిత అనంత శ్రీ‌రామ్. ఆయ‌న తాజాగా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి సినీ రంగంలో. అనంత శ్రీరామ్ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి అని చ‌ర్చ‌కు దారితీశాయి. ఒక ఇంటర్వ్యూ సంద‌ర్బంగా మీరు స‌ర‌స్వ‌తి పుత్రుడంటూ పేర్కొన్నారు. దీనిపై ఆయ‌న అభ్యంత‌రం తెలిపారు. లేదండీ, మా అమ్మ పేరు పావని అని బదులివ్వడం ఇప్పుడు చిత్రసీమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన తల్లి పేరు పావని అని చెప్పడంలో ఆయన మాటల్లో స్పష్టమైన విరుపు కనిపించింది. టాలీవుడ్‌లో ‘సరస్వతి పుత్ర’ అనే ట్యాగ్ ఎవరికి ఉందో, టైటిల్ కార్డ్స్ లో ఆ పేరు తప్పనిసరిగా ఎలా వేయించు కుంటున్నారో అందరికీ తెలిసిందే.

“అసలు సరస్వతి పుత్రులు అంటే ఎవరు?” అనే ప్రశ్నకు బదులిస్తూ.. వేదాల నుంచి ఆధునిక కవిత్వం వరకు శ్రీశ్రీ, దేవులపల్లి లాంటి మహానుభావులకు ఉన్నంత లోతైన అవగాహన ఉన్నవారే ఆ బిరుదుకు అర్హులు అంటూ అనంత శ్రీరామ్ కుండ బద్దలు కొట్టారు. సినిమాల్లో ఉంటూ ఆ బిరుదుకు తగ్గ బాధ్యతను మోయడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మరి అనంత శ్రీరామ్ చేసిన ఈ సున్నితమైన వ్యాఖ్యలు.. నేరుగా ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రిని ఉద్దేశించే అన్నారా? తెలివిగా కౌంటర్ ఇచ్చారా? అని తెగ చ‌ర్చించుకుంటున్నారు సినీ ప్రేమికులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *