ఇంటిల్లిపాదిని అలరిం చేలా చిత్రం
హైదరాబాద్ : ఇంటిల్లిపాదిని ఆకట్టుకునేలా రాకస మూవీని తీశారు దర్శకురాలు మానస శర్మ. దీనిని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించింది. పూర్తిగా ఫాంటసీ-కామెడీ చిత్రంగా మలిచారు. దీనిని నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నిర్మించారు . అన్ని వయసుల ప్రేక్షకుల కోసం ఆకర్షణీయమైన హాస్యంతో ఊహాత్మక ఫాంటసీని మిళితం చేయడం ఈ మూవీ ప్రధాన ఉద్దేశం. ఈ సినిమాలో భారీ తారాగణం కూడా ఉండడం విశేషం.
రాకాస మూవీలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుఖ్విందర్ సింగ్, అనూప్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి , రోహన్ రాయ్‌లతో పాటు సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రలలో నటించారు. సినిమా కథ, స్క్రీన్ ప్లే అంతా మానస శర్మ చేశారు. సంగీతం అనుదీప్ దేవ్ ఇచ్చారు. ఇక ఈ చిత్రానికి పాటలు అందించారు రఘురాం, సింహాచలం మన్నెల, కిట్టు విస్సాప్రగడ. మరో వైపు రాకాస మూవీకి సంబంధించిన సింగిల్స్ , టీజర్ కు మంచి ఆదరణ లభించింది. మొత్తంగా ప్రతి ఒక్కరు హాయిగా చూడాల్సిన మూవీ అని చెప్పక తప్పదు.





