Friday, 16 October 2026

ఆర్గానిక్ మిల్టెట్ ఫుడ్ మెనూ సూప‌ర్ : సీఎం

newsseals-APCM

అర‌కు కౌని రూపొందించ‌డం అభినంద‌నీయం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆర్గానిక్ మిల్టెట్ ఫుడ్ మెనూను ఆవిష్క‌రించారు .
అరకు కౌని’ పేరుతో రూపొందించినందుకు అభినందించారు. రాష్ట్ర సచివాలయంలో 6వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు ఏర్పాటు చేసిన ఈ ఆర్గానిక్ మిల్లెట్ ఆహార ఉత్పత్తుల స్టాల్‌ను సీఎం సందర్శించారు. గిరిజనులు పండించిన కొర్రలు, రాగులు, సామలు, కాకిజొన్నలు, గంట్ల, మొక్కజొన్న, కొండ కందులు, రాజ్మాతో చేసిన కొర్ర పాయసం, రాగి చపాతీ, సామల పులిహోర, కాంట్ల అంబలి, కార్న్ వడ, తూర్ దాల్ కర్రీ వంటి ఆహార ఉత్పత్తులను పరిశీలించి రుచి చూశారు.

గిరిజనుల ఆహార సంప్రదాయాలను గౌరవిస్తూ ఆరోగ్యకరమైన మిల్లెట్ ఆహారాన్ని మరింత ప్రోత్సహించాలని సీఎం సూచించారు. టూరిజం, ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్ కలిసి రాష్ట్రంలోని స్టార్ హోటళ్లు, ఆతిథ్య సంస్థలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నాయని సీఎంకు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండ‌గా అభివృద్ధికి, మౌలిక సదుపాయల కల్పనకు అటవీ శాఖ సహకరించాలని సూచించారు.. నాలుగోసారి సీఎంగా చేస్తున్నాను.. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి అటవీ శాఖ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. దీనిపై ఇప్పటికే డిప్యూటీ సీఎంతో మాట్లాడానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *