సంజు శాంస‌న్ తో క‌లిసి ఆడ‌టం అద్భుతం

Spread the love

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన అభిషేక్ శ‌ర్మ‌

కేర‌ళ : పంజాబ్ కు చెందిన స్టార్ ఇండియ‌న్ క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి ప్ర‌శంస‌లు కురిపించాడు. తామిద్ద‌రం క‌లిసి గ‌త 2024 నుంచి ప్ర‌యాణం చేస్తున్నామ‌ని చెప్పాడు. ఇద్ద‌రి మ‌ధ్య మంచి బాండింగ్ ఉంద‌న్నాడు. ప్ర‌ముఖ భార‌తీయ మీడియా సంస్థ ఇండియా టుడే ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హంచిన కాన్ క్లేవ్ లో పాల్గొన్నారు అభిషేక్ శ‌ర్మ‌, సంజు శాంస‌న్. ఈ సంద‌ర్బంగా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు కూల్ గా స‌మాధానాలు ఇచ్చారు. 2024 నుండి అభిషేక్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం తాను ఎంతగానో ఆస్వాదించానని, తామిద్దరం కలిసి ఎలాంటి అద్భుతాలు చేయగలమో తనకు ముందే తెలుసని శాంసన్ చెప్పాడు.

మైదానంలోనే కాకుండా మైదానం వెలుపల కూడా తనకు, అభిషేక్‌కు మధ్య మంచి స్నేహం ఉందని అన్నాడు . మ్యాచ్‌ల సమయంలో తమ మధ్య విషయాలు చాలా సరళంగా, సులభంగా సాగడానికి ఈ స్నేహమే దోహద పడుతుందని పేర్కొన్నాడు అభిషేక్ శ‌ర్మ‌. మా ఇద్ద‌రి మ‌ధ్య భాగ‌స్వామ్యం , ఆట పూర్తిగా మంచుతో కూడుకుని ఉండ‌ద‌ని, ఫైర్ లాగా ఉంటుంద‌న్నాడు. మాది పంజాబ్, కేర‌ళ మ‌ధ్య సంబంధం ఉంద‌న్నాడు అభిషేక్ శ‌ర్మ‌. నేను శాంస‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ‌తా. బంతి ఎలా వస్తుంద‌ని అడుగుతా. దీంతో శాంస‌న్ చెప్పిన‌ట్టు చేస్తా. ఇక సిక్సులు కొట్ట‌డం మొద‌లు పెడ‌తాన‌ని చెప్పాడు అభిషేక్ శ‌ర్మ‌. శాంస‌న్ త‌న‌కు సోద‌రుడు లాంటి వాడ‌న్నాడు.

  • Related Posts

    హెడ్ కోచ్ గౌతం గంభీర్ కు అరుదైన గౌర‌వం

    Spread the love

    Spread the loveస్పోర్ట్స్ లీడ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు న్యూఢిల్లీ : భార‌త క్రికెట్ జ‌ట్టును ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కైవ‌సం చేసుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించారు భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్, ప్ర‌స్తుత హెడ్ కోచ్ గౌతం…

    రికార్డుల కంటే దేశం కోసం ఆడ‌ట‌మే ముఖ్యం

    Spread the love

    Spread the loveఅంద‌రి మ‌న‌సులు దోచుకున్న సంజు శాంస‌న్ కేర‌ళ : ఇండియ‌న్ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. భార‌తీయ ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియా టుడే ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన కాన్ క్లేవ్ లో మ‌రో స్టార్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *