ప‌ర‌మ‌త స‌హ‌నం రంజాన్ పండుగ ప్ర‌త్యేక‌త

VijayaBhaskar · March 16, 2026
Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : అన్ని మతాలకు చెందిన వారు కలిసికట్టుగా సోదర భావంతో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించు కుందామని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఇఫ్తార్ విందు సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మైనారిటీల అభ్యున్నతికి సాధ్యమైనంత మేరకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ప‌విత్ర రంజాన్ మాసం
సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

రంజాన్ మాసం ఒక పండుగ మాత్రమే కాద‌ని, విలువలను గుర్తుచేసే పవిత్ర మాసం అన్నారు. నెల రోజులపాటు ఆత్మశుద్ధితో పరులకు సహకారం అందిస్తూ అందరితో సత్సంబంధాలను కొనసాగించడమే రంజాన్ మాసం పవిత్రత అని పేర్కొన్నారు సీఎం. రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంద‌న్నారు. క్రికెటర్ అజారుద్దీన్ కు మంత్రి పదవి, షబ్బీర్ అలీకి ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా, క్రికెట‌ర్ సిరాజ్ కు డీఎస్పీ, బాక్సింగ్ ఛాంపియ‌న్ నిఖ‌త్ జ‌రీన్ కు రూ. 2 కోట్లు సాయం చేశామ‌న్నారు.