బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Spread the love

శ్రీ కోదండ రామస్వామి వారి ఆల‌యంలో

తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి, తోమాల, సహస్ర నామార్చన చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు వేద ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, మేదినీ పూజ, మృత్సం గ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. మంగ‌ళ‌వారం ఉదయం 8 నుండి 9 గంటల మధ్య మేష ల‌గ్నంలో ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి.

ఇందులో భాగంగా ఉదయం 6.30 నుండి 8 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి వారు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం చేప‌ట్టారు. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండ రామస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న‌ జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు ఎపి.ఆనంద కుమార్ దీక్షితులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ సురేష్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఏప్రిల్ 1న ఒంటిమిట్ట‌లో సీతారాముల క‌ళ్యాణోత్స‌వం

    Spread the love

    Spread the loveప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్న సీఎం చంద్ర‌బాబు తిరుప‌తి : ప్ర‌ముఖ పుణ్య క్షేత్రం ఒంటిమిట్ట‌లోని శ్రీ కోదండ రామ‌స్వామి ఆల‌యంలో మార్చి 27 నుంచి బ్ర‌హ్మోత్స‌వ‌లు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఆల‌యాన్ని టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు…

    ఘ‌నంగా శ్రీ తాళ్ల‌పాక అన్న‌మ‌య్య వ‌ర్దంతి

    Spread the love

    Spread the loveఆక‌ట్టుకున్న సంకీర్త‌న‌ల గోష్ఠిగానం తిరుపతి : శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 523వ వర్ధంతి మహోత్సవాలు టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన స‌ప్త‌గిరి సంకీర్తనల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *