అక్ష‌య పాత్ర అరుదైన రికార్డ్

Spread the love

5 బిలియ‌న్ భోజ‌నాల మైలు రాయి

న్యూఢిల్లీ : ఇస్కాన్ కు చెందిన అక్ష‌య పాత్ర అరుదైన రికార్డు సాధించింది. సంస్థ ప్రారంభించి నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. అంతే కాదు ఏకంగా 5 బిలియ‌న్ భోజ‌నాల‌ను అందించి రికార్డు సృష్టించింది. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర‌పతి ద్రౌప‌ది ముర్ము సంస్థ‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. 2047 నాటికి ‘వికీత్ భారత్’ను నిర్మించాలన్న మన జాతీయ సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో పోషకాహారం, విద్య కలిగిన సమాజం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో అక్షయపాత్ర ఫౌండేషన్ సభ్యులు, ప్రముఖులతో రాష్ట్రపతి భేటీ అయ్యారు.

‘విజయ భారత్ కోసం సుపోషిత, సుశిక్షిత భారత్’ అనే ఈ కార్యక్రమం, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం పిల్లల పోషణ , విద్య దిశగా జరుగుతున్న ప్రయత్నాలను ప్రముఖంగా ప్రస్తావించింది. రాష్ట్రపతి ముర్ము బహుమతులు పంపిణీ చేసి, భోజనం వడ్డించి, స్వయంగా పిల్లలకు తినిపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పీఎం పోషణ్ కార్యక్రమానికి అమలు భాగస్వామిగా, అక్షయపాత్ర భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది పిల్లలకు తాజా, పోషకమైన భోజనాన్ని అందిస్తోంది. ఈ ఫౌండేషన్ ప్రస్తుతం భారతదేశంలోని 16 రాష్ట్రాలు , 3 కేంద్రపాలిత ప్రాంతాలలో 78 ప్రదేశాలలో ఉన్న తన వంటశాలల ద్వారా 23.5 లక్షల మంది పిల్లలకు ఆహారం అందిస్తోంది .

  • Related Posts

    స్వేచ్ఛ కుటుంబానికి జేసీహెచ్ఎస్ఎల్ ఆస‌రా

    Spread the love

    Spread the loveరూ. 50,000 ఆర్థిక సాయం అంద‌జేసిన ప్రెసిడెంట్ హైద‌రాబాద్ : ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ త‌న ఉదార‌త‌ను చాటుకుంది. గత సంవత్సరం జూన్ నెలలో మరణించిన ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ…

    గుడ్ మార్నింగ్ చెప్పడం తప్ప చేసిందేమీ లేదు

    Spread the love

    Spread the loveమాజీ ఎమ్మెల్యే వెంక‌ట్రామిరెడ్డిపై స‌విత సెటైర్ శ్రీ స‌త్య‌సాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత నిప్పులు చెరిగారు. శ్రీ స‌త్య‌సాయి జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వెంక‌ట్రామిరెడ్డిపై సెటైర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *