టీటీడీ ట్రస్టులకు రూ.70 లక్షలు విరాళం

అభినందించిన ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌

తిరుప‌తి : కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వినుతికెక్కింది తిరుమ‌ల‌. ఇక్క‌డ కొలువైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేందుకు ప్ర‌తినిత్యం కోట్లాది మంది వ‌స్తుంటారు. స్వామిని కొలిస్తే కోరిన కోర్కెలు తీరుతాయ‌ని ప్ర‌గాఢ న‌మ్మ‌కం, విశ్వాసం కూడా. ఇదిలా ఉండ‌గా భ‌క్తులు, సంస్థ‌లు, వ్యాపార‌, వాణిజ్య‌వేత్త‌లు, కార్పొరేట్ సంస్థ‌లు, కంపెనీలు, ప్ర‌ముఖులు ప్ర‌తి నిత్యం టీటీడీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ట్ర‌స్టుల‌కు విరాళాలు అందిస్తూ వ‌స్తున్నారు. తాజాగా టీటీడీ ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్రస్టుకు బుధ‌వారం రూ.70 లక్షలు విరాళంగా అందింది.

నెల్లూరు జిల్లాకు చెందిన శంక‌ర్ ఎంట‌ర్ ప్రైజెస్ అధినేత జ‌య‌శేఖ‌ర్‌ రూ.10 ల‌క్ష‌లు, చిత్తూరుకు చెందిన బాలాజీ ప్యాకింగ్ ఇండ‌స్ట్రీస్‌ ర‌మేష్‌బాబు రూ.10 ల‌క్ష‌లు, వినాయ‌క ఫౌల్ట్రీఫాం అధినేత రాధ శ్రీ‌నివాసులు రూ.10 ల‌క్ష‌లు, చిత్తూరు జిల్లా కొటార్ల‌ప‌ల్లికి చెందిన మంజునాథ్ రూ.10 ల‌క్ష‌లు, శ్రీ‌వారి ఫౌల్ట్రీఫాం అధినేత హేమాద్రి రూ.10 ల‌క్ష‌లు, ఫౌల్ట్రీఫాం అధినేత ర‌వికుమార్ రూ.10 ల‌క్ష‌లు, ప‌ల‌మ‌నేరుకు చెందిన ఎస్ ఆర్ ఎస్‌ ఎంట‌ర్ ప్రైజ‌స్ అధినేత పురుషోత్తం రూ.10 ల‌క్ష‌లు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాతలు విరాళం డిడిలను తిరుప‌తిలోని ఈవో బంగ్లాలో టీటీడీ ఈవో ఎం.ర‌విచంద్ర‌కు అందజేశారు. ఈసంద‌ర్బంగా భారీ ఎత్తున విరాళాలు అందించిన దాత‌ల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు . వారికి స్వామి వారి కృప ఉండాల‌ని కోరారు.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *