చిన్నశేష వాహనంపై విహరించిన శ్రీ కోదండ రాముడు

Spread the love

ఘ‌నంగా వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం

తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం ఉదయం 8 గంట‌ల‌కు చిన్నశేష వాహనంపై శ్రీ కోదండ రాముడు విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.

కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలినీ శక్తి జాగృతం అత్యంత ఉత్కృష్ఠమైనది. ఈ కుండలినీ శక్తి సాధారణంగా సర్ప రూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలినీ శక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్నశేష వాహనం. అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు కల్యాణ మండపంలో శ్రీసీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి వారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.

వాహ‌న సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో రవి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ‌వారి భ‌క్తుల‌కు ఉగాది శుభాకాంక్షలు : టీటీడీ

    Spread the love

    Spread the loveటీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో ర‌విచంద్ర‌ తిరుపతి : శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు వి.…

    టీటీడీ ట్రస్టులకు రూ.70 లక్షలు విరాళం

    Spread the love

    Spread the loveఅభినందించిన ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌ తిరుప‌తి : కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వినుతికెక్కింది తిరుమ‌ల‌. ఇక్క‌డ కొలువైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేందుకు ప్ర‌తినిత్యం కోట్లాది మంది వ‌స్తుంటారు. స్వామిని కొలిస్తే కోరిన కోర్కెలు తీరుతాయ‌ని ప్ర‌గాఢ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *