టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర
తిరుపతి : శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు వి. వీరబ్రహ్మం, డా. ఎ. శరత్ భక్తులకు, ఉద్యోగులకు, అర్చకులకు, ప్రజలకు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
నూతన సంవత్సరాన్ని ఆనందంగా, భక్తి భావంతో జరుపుకోవాలని వారు కోరుకున్నారు. శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఆ దేవ దేవుడు, కలియుగ శ్రీ వేంకటేశ్వర స్వామిని నిత్యం కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటారని తెలిపారు. ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు చైర్మన్, ఈవో. ఇప్పటి వరకు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. నూతన భవనాలను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని వసతి సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు బీఆర్ నాయుడు, ముద్దాడ రవిచంద్ర.





