స‌మాజ చైత‌న్యం కోసం సినిమా సాధ‌నం కావాలి

Spread the love

పిలుపునిచ్చిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ది కోసం ప్ర‌జా ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఐలైన్ హైదరాబాద్ తన కేంద్రాన్ని ప్రారంభించిందని, నెట్‌ఫ్లిక్స్ రాకతో హైదరాబాద్‌కు హాలీవుడ్ వచ్చినట్టేన‌ని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ సినిమాల నిర్మాణం కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తాం అని ప్ర‌క‌టించారు. అందుకు త్వరలోనే ఒక ప్లాట్‌ఫామ్‌ క్రియేట్ చేస్తామ‌ని చెప్పారు సీఎం.

లక్షల కోట్ల మందిని తన గళంతో ప్రజలను ప్రభావితం చేసిన ప్రజాయుద్ధ నౌక గ‌ద్ద‌ర్ ఒక చైతన్యం, స్ఫూర్తి, అందుకని ఆయ‌న‌ పేరుతో ఈ అవార్డులను పునరుద్ధరించాం అని తెలిపారు. సామాజిక సమస్యలను పరిష్కరించుకోవడానికి సినిమాలు అత్యంత ప్రభావ వంతమైన ఆయుధంగా ఉప‌యోగ ప‌డ‌తాయ‌ని చెప్పారు. సమాజాన్ని చైతన్య పరిచేందుకు సినిమా ఒక సాధనంగా ఉపయోగపడాలి. సామాజిక బాధ్యతను గుర్తెరిగి, సామాజిక సమస్యల పరిష్కారానికి సినిమాల ద్వారా సందేశం అందించాలని పిలుపునిచ్చారు సీఎం.

తెలంగాణ అత్యంత భద్రత కలిగిన రాష్ట్రం. టాలెంట్‌కు అవకాశాలున్నాయి. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుంది. హాలీవుడ్ చిత్రాలను ఇక్కడ నిర్మించండి. మీ పెట్టుబడులకు భద్రత ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వం హామీనిస్తుంది అని చెప్పారు. ప్రత్యేక విభాగంలో కొణిదెల చిరంజీవి (ఎన్టీఆర్ జాతీయ పురస్కారం), సింగీతం శ్రీనివాస రావు (బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు), చలసాని అశ్వినీదత్ (నాగిరెడ్డి చక్రపాణి అవార్డు), సుద్దాల అశోక్ తేజ (డాక్టర్ సి. నారాయణరెడ్డి అవార్డు), జయసుధ (అక్కినేని నాగేశ్వరరావు అవార్డు), ఆర్ నారాయణ మూర్తి (కాంతారావు అవార్డు), అక్కినేని రమేష్ ప్రసాద్ (రఘుపతి వెంకయ్య అవార్డు), కమల్ హాసన్ (పైడి జైరాజ్ అవార్డు), ఉత్తమ నటుడు నాగ చైత‌న్య (తండేల్), ఉత్తమ నటిగా ర‌ష్మిక మంద‌న్నా (ది గర్ల్ ఫ్రెండ్)లతో పాటు వివిధ కేటగిరీల్లో విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రం, నగదు బహుమతిని అందించారు.

  • Related Posts

    సీఎం జోసెఫ్ విజ‌య్ డ్యాన్స్ వీడియో వైర‌ల్

    Spread the love

    Spread the loveత్వ‌ర‌లో రిలీజ్ కానున్న జ‌న నాయ‌గ‌న్ చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రానికి నూత‌న సీఎంగా ఎన్నికైన ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ చంద్ర‌శేఖర్ ఇప్పుడు వైర‌ల్ గా మారారు. త‌ను చివ‌రిసారిగా న‌టించిన జ‌న నాయ‌గ‌న్ చిత్రంలో భాగంగా సింగ‌పూర్…

    త‌మిళ‌నాడు భూమి పుత్రుడు జోసెఫ్ విజ‌య్

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన న‌టి స‌న‌మ్ శెట్టి చెన్నై: జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంద‌ర్బంగా సినీ ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. తమిళ నటి సనమ్ శెట్టి ఇలా అన్నారు. ఈ రోజు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *