సంజు శాంస‌న్ స్థానాన్ని ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేరు

VijayaBhaskar · March 19, 2026
Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన రాజ‌స్తాన్ రాయల్స్ కెప్టెన్

ఢిల్లీ : ఐపీఎల్ 2026 లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు నూత‌న కెప్టెన్ గా ఎంపికైన‌ రియాన్ ప‌రాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఏడాది ప్రీ-సీజన్ సంద‌ర్భంగా జ‌రిగిన‌ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ మాట్లాడారు, సంజు సామ్సన్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని స్ప‌ష్టం చేశారు. ఈ సీజన్‌లో మెరుగైన ప్రణాళిక, మ్యాచ్‌లను ముగించడంపై జట్టు దృష్టి సారిస్తుందని నొక్కి చెప్పారు. తాము అతని (సంజు సామ్సన్) స్థానాన్ని భర్తీ చేయడం గురించి ఎప్పుడూ ఆలోచించ లేద‌ని పేర్కొన్నారు. మీరు రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయగలరా? లేదని అన్నారు రియాన్ ప‌రాగ్. అదే విధంగా, సంజు భయ్యా స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నారు.

అతనిలాంటి నైపుణ్యాలు ఉన్నవారిని ప్రయత్నించవచ్చు లేదా అతని స్థానంలో బ్యాటింగ్ చేయమని ఎవరినైనా అడగవచ్చు అని అన్నాడు రియాన్ ప‌రాగ్. కానీ అతని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని చెప్పాడు. ఈ సంవత్సరం, మెరుగైన ప్రణాళిక వేసి మ్యాచ్‌లను ముగించడంపై దృష్టి సారించాం అన్నారు. ఇది తాము గత సీజన్‌లో చేయలేక పోయామన్నారు. ఇదిలా ఉండ‌గా ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాళ్ల‌లో సంజు శాంస‌న్ ఒక‌డిగా ఉన్నాడు. ఈ ఏడాదిలో జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో 5 ఇన్నింగ్స్ లు ఆడి 321 ర‌న్స్ చేశాడు. ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ అవార్డుకు ఎంపిక‌య్యాడు.