మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ కు స‌న్మానం

Spread the love

హాజ‌రైన జాతీయ మహిళా క‌మిష‌న్ చైర్మ‌న్
నంద్యాల జిల్లా : జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీ విజయ కిషోర్ రహత్కర్ తో కలిసి శ్రీశైలంలోని శ్రీ అక్క మహాదేవి ఆశ్రమంలో జరిగిన “ఏక్ లక్ష్ పెడ్ గురు మాతా” కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీ రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ డాక్ట‌ర్ శైల‌జా రాయ‌పాటి. విజేతలకు శ్రీ అక్క మహాదేవి రాష్ట్రీయ పురస్కారాలను ప్రధానం చేశారు. అనంతరం ఈవో కార్యాలయంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా గారు, ఎస్పీ సునీల్ షెరాన్ , జిల్లా అధికార యంత్రాంగంతో ఏర్పాటు చేసిన జిల్లా రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు.

జిల్లాలో నమోదైన కేసుల వివరాలు, వాటి పురోగతి మహిళా రక్షణ, సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్. స్వయం ఉపాధితో మహిళలు సాధించిన విజయాలను, జిల్లా ప్రాముఖ్యతను కలెక్టర్ సవివరంగా వివరించారు. అనంతరం విజయ కిషోర్ రహత్కర్ తో కలిసి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను దర్శించుకొన్నారు శైల‌జ‌. ప్రత్యేక పూజలు నిర్వహించి దేశం సుభిక్షంగా ఉండేలా చూడాలని వేడుకున్న‌ట్లు తెలిపారు చైర్ ప‌ర్స‌న్.

  • Related Posts

    మ‌హ‌నీయుల సంకీర్త‌న‌లు నైతిక విలువ‌ల‌కు ప్ర‌తీక‌లు

    Spread the love

    Spread the loveక‌ర్ణాట‌క రాష్ట్ర ఓపెన్ యూనివ‌ర్శిటీ డీన్ ఆచార్య రామ‌నాథం తిరుప‌తి : అన్నమయ్య, పురంధర దాసుల సంకీర్తనలు భక్తి, నైతిక విలువలు, సమానత్వ భావనలను ప్రజల్లో విస్తరించాయని, నామ సంకీర్తన ద్వారా భగవంతుని చేరుకోవచ్చని అన్నారు మైసూరు కర్ణాటక…

    తిరుమలలో ఆధ్యాత్మిక వైభ‌వం స్వ‌ర సంగ‌మం

    Spread the love

    Spread the loveభక్తులను మైమరపించిన భక్తి సంగీత విభావరి తిరుమల : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల నాదనీ రజనం వేదికపై నిర్వహించిన “స్వరసంగమం” భక్తి సంగీత కార్యక్రమం భక్తులను సంగీత తరంగాల్లో ముంచెత్తింది. “స్వర సంగమం” అనే ఈ ప్రత్యేక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *