మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ కు స‌న్మానం

హాజ‌రైన జాతీయ మహిళా క‌మిష‌న్ చైర్మ‌న్
నంద్యాల జిల్లా : జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీ విజయ కిషోర్ రహత్కర్ తో కలిసి శ్రీశైలంలోని శ్రీ అక్క మహాదేవి ఆశ్రమంలో జరిగిన “ఏక్ లక్ష్ పెడ్ గురు మాతా” కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీ రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ డాక్ట‌ర్ శైల‌జా రాయ‌పాటి. విజేతలకు శ్రీ అక్క మహాదేవి రాష్ట్రీయ పురస్కారాలను ప్రధానం చేశారు. అనంతరం ఈవో కార్యాలయంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా గారు, ఎస్పీ సునీల్ షెరాన్ , జిల్లా అధికార యంత్రాంగంతో ఏర్పాటు చేసిన జిల్లా రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు.

జిల్లాలో నమోదైన కేసుల వివరాలు, వాటి పురోగతి మహిళా రక్షణ, సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్. స్వయం ఉపాధితో మహిళలు సాధించిన విజయాలను, జిల్లా ప్రాముఖ్యతను కలెక్టర్ సవివరంగా వివరించారు. అనంతరం విజయ కిషోర్ రహత్కర్ తో కలిసి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను దర్శించుకొన్నారు శైల‌జ‌. ప్రత్యేక పూజలు నిర్వహించి దేశం సుభిక్షంగా ఉండేలా చూడాలని వేడుకున్న‌ట్లు తెలిపారు చైర్ ప‌ర్స‌న్.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *